Kohli- Rohit: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లోని ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లతో పోలిస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ప్రధాన ప్రత్యేకత భారత ఆటగాళ్ల విషయంలో కనిపిస్తుంది. ప్రస్తుతం రిటైర్ కాకుండా ఉన్న ఏ భారత క్రికెటర్‌కైనా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు అనుమతి లేదు.. దీని వల్ల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆడే ఏకైక ఫ్రాంచైజీ టీ20 టోర్నమెంట్‌గా ఐపీఎల్ నిలుస్తోంది.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్.. మరో కేసు నమోదు
ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు భవిష్యత్తులో విదేశీ టీ20 లీగ్‌లలో ఆడే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో టీమిండియా ఆటగాళ్లు ఓవర్సీస్ లీగ్‌లలో ఆడే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీనికి ప్రధాన కారణం ప్లేయర్స్ పై అధిక వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అని ఆయన పేర్కొన్నారు. ఇక, బీసీసీఐ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లు తప్పనిసరిగా దేశీయ క్రికెట్‌లో కూడా పాల్గొనాల్సి ఉంటుందన్నారు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నీల్లో వారు ఆడాల్సిందేనని చెప్పుకొచ్చారు. దేశంలోనే ఇంత బిజీ క్రికెట్ షెడ్యూల్ ఉండగా, ప్రేక్షకుల ఆదరణ భారీగా ఉన్న నేపథ్యంలో విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ వెల్లడించారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, స్టార్ ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడటం మరింత కష్టమని ధుమాల్ స్పష్టం చేశారు. కొందరు ప్లేయర్స్ టెస్టులు, వన్డేలు, టీ20లలో ఏదో ఒక ఫార్మాట్లో నిరంతరం ఆడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ లీగ్‌లకు వెళ్లడం అసాధ్యమని అన్నారు. వర్క్‌లోడ్ నియంత్రణ అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. అలాగే, బౌలర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.. కొన్ని సందర్భాల్లో రెండు టెస్టులు ఆడిన తర్వాతే బౌలర్లకు రెస్ట్ ఇవ్వాల్సి వస్తోంది.. వన్డేలు, టీ20ల్లోనూ రొటేషన్ పాటించాల్సి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి లీగ్‌లు ఆడమని పర్మిషన్ ఇస్తే.. అది మన జాతీయ జట్టుకు నష్టం కలిగించే అవకాశం ఉందని తెలియజేశాడు.
IPL Chairman on possibility top India players participating in foreign leagues . Interesting arguments by @ThakurArunS pic.twitter.com/FOxkk9AwGe
— Vimal कुमार (@Vimalwa) December 17, 2025