Narendra Modi Stadium is Luky to Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. రెండు నెలలుగా 10 జట్లు హోరాహోరీగా తలపడి.. చివరికి నాలుగు టీమ్‌లు నాకౌట్ దశకు చేరాయి. నేడు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమేనటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయిర్-2లో తలపడుతుంది. రిస్క్ తీసుకోకుండా క్వాలిఫయర్-1లోనే గెలిచి ఫైనల్ చేరుకోవాలని కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ చూస్తున్నాయి. కీలక మ్యాచ్ నేపథ్యంలో సన్‌రైజర్స్‌కు ఓ శుభవార్త.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ టీమ్స్ ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 17 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఎస్‌ఆర్‌హెచ్ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గణాంకాలు ఆరెంజ్ ఆర్మీని కాస్త టెన్షన్ పెడుతున్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం తెలుగు జట్టు సన్‌రైజర్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. నేటి మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. మ్యాచ్ సజావుగా సాగడం ఖాయం. వర్షం కారణంగా సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే.. సీజన్‌ను ఎక్కువ పాయింట్లతో ముగించిన కేకేఆర్ ఫైనల్ చేరుతుంది.
Also Read: Actress Hema: బెంగళూరు రేవ్‌పార్టీ.. నటి హేమ వీడియోపై కేసు?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కేకేఆర్ స్టార్ ప్లేయర్లకు చెత్త రికార్డు ఉంది. కేకేఆర్ విజయాల్లో సునీల్ నరైన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్పిన్నర్‌గా మాత్రమే కాకుండా.. బ్యాటర్‌గా మరింత రెచ్చిపోతున్నాడు. అయితే అహ్మదాబాద్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన నరైన్.. మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఇక్కడ హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ రికార్డు కూడా పేలవంగా ఉంది. ఈ మైదానంలో అతని స్ట్రైక్‌రేటు 140 మాత్రమే. నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అహ్మదాబాద్‌లో భువనేశ్వర్ కుమార్‌కు మెరుగైన రికార్డు ఉంది. మూడు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఫామ్‌లో ఉన్న కేకేఆర్ ఓపెనర్ ఫీల్ సాల్ట్ టోర్నీకి దూరమవ్వడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశమే. నేడు అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్‌కు చాలానే కలిసిరానుంది.