Virat Kohli Next Match: RCBకి ఐపీఎల్ 2026 టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ.. మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Next Match: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మరోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించి, తన కలను నిజం చేసుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తదుపరి ఎప్పుడు మైదానంలో కనిపిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ అందించిన కోహ్లీ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 43 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో విజయం సాధించే సిక్స్ కొట్టిన కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇక, మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ, “ఐపీఎల్ ట్రోఫీ గెలిచి, చివరి పరుగులు నేనే చేయాలని ఎన్నోసార్లు కలగన్నాను. ఈ రోజు అది నిజమైంది. ఇది నా కలల రోజు” అని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ విజయానికి కేవలం కోహ్లీ మాత్రమే కాకుండా జట్టులోని పలువురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, రసిఖ్ సలాందర్ వంటి బౌలర్లు జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించారు. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మ్యాచ్‌లు గెలిపించడంతో తనపై ఒత్తిడి తగ్గిందని కోహ్లీ పేర్కొన్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
కోహ్లీ తదుపరి మ్యాచ్ ఎప్పుడు?
టీ20 అంతర్జాతీయాలు, టెస్టు క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టుకు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ – ఆఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. భారత్, ఆఫ్గాన్ మధ్య ముందుగా జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూన్ 13న ప్రారంభం కానుంది. రెండో, మూడో వన్డేలు వరుసగా జూన్ 17, జూన్ 20 తేదీల్లో నిర్వహించనున్నారు. దీంతో ఐపీఎల్ 2026లో టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ తదుపరి సారి జూన్ 13న ఆఫ్గానిస్థాన్‌తో జరిగే తొలి వన్డేలో భారత జెర్సీలో అభిమానులను అలరించనున్నాడు. అభిమానులు ఇప్పటికే ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!