RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్‌నే మార్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs GT: ఐపీఎల్లో ఒక్క చిన్న పొరపాటు మ్యాచ్పరిస్థితులను మర్చతుంది. నిన్నటి మ్యాచ్‌లో అదే జరిగింది. విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ నేలపాలు చేశాడు. డకౌట్ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక లైఫ్ దొరికిన విరాట్ రెచ్చిపోయి 81 పరుగులు సాధించాడు. చివరకు మ్యాచ్‌ను గెలిపించాడు. అసలు ఏం జరిగిందంటే..? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ టైటాన్స్ (GT)ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం నమోదు చేసింది. శుక్రవారం ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓవర్లలో 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో 20 ఓవర్లలో 205/3 భారీ స్కోరును నమోదు చేసింది. సుదర్శన్ సెంచరీ చేసినా ఫలించలేదు. ఇక, ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ (81), దేవదత్ పడిక్కల్ (55) అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది.
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి మొదట్లోనే గట్టి షాక్ తగిలేలా కనిపించింది. మొదటి ఓవర్లోనే విరాట్‌ను పెవిలియన్‌కు పంపే అవకాశాన్ని గుజరాత్ మిస్ చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేశాడు. మహమ్మద్ సిరాజ్ మొదటి ఓవర్లో ఒక లూప్ డెలివరీని విరాట్ సరిగ్గా అంచనా వేయలేదు. షాట్ ఆడటంలో కాస్త తడబడ్డాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్-వికెట్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ చేతుల్లోకి నేరుగా వెళ్లింది. వాస్తవానికి ఇది చాలా ఈజీ క్యాచ్. కానీ.. వాషింగ్టన్ సుందర్ దాన్ని జారవిడిచాడు. దీంతో బౌలర్ సిరాజ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. కోహ్లీని సున్నా పరుగులకే ఔట్ చేసి గుజరాత్‌ను పైచేయి సాధించేలా చేసే సువర్ణావకాశాన్ని సుందర్ చేజార్చాడు. ఈ తప్పిదం మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పేసింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
-
Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!