RR vs SRH: ఆ రెండే కారణం.. క్వాలిఫయర్ -2లోకి రాజస్థాన్, ఇంటికి హైదరాబాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR vs SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లింది. ముల్లన్పూర్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ తన వేగంతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.. దీంతో, ఐపీఎల్ క్వాలిఫయర్ రేస్ నుంచి SRH తప్పుకోవాల్సి వచ్చింది..
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో రాజస్థాన్ ఇప్పుడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్ విజేత ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొంటుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను ఐపీఎల్ వేదికపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్, తన ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని అతను కేవలం మూడు పరుగుల దూరంలో కోల్పోయాడు. ప్రస్తుతం ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది.
మ్యాచ్ ఆరంభం నుంచే వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. ఫుల్ లెంగ్త్ బంతులను సైట్ స్క్రీన్ మీదుగా పంపించడమే కాకుండా, షార్ట్ బంతులను కూడా సిక్సర్లుగా మలిచాడు. అతని దూకుడును అడ్డుకునేందుకు కమిన్స్ ఫీల్డింగ్ మార్పులు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ సీజన్లో వైభవ్ మరో అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును అధిగమిస్తూ వైభవ్ 65 సిక్సర్లు నమోదు చేశాడు.
కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్, టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సామర్థ్యం తనలో ఉందనే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఎనిమిదో ఓవర్లో ప్రఫుల్ హింజ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో అతని చారిత్రాత్మక ఇన్నింగ్స్ ముగిసింది. అవుటైన తర్వాత అతని నిరాశ స్పష్టంగా కనిపించింది. వైభవ్‌కు తోడుగా ధ్రువ్ జురెల్ కూడా వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. ఒక దశలో రాజస్థాన్ 260 పరుగులు దాటేలా కనిపించినా, చివరి ఐదు ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కొంత నియంత్రణ సాధించారు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింజ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే అతను నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చాడు. పాట్ కమిన్స్‌కు ఇది మరచిపోలేని చెత్త రోజు అయ్యింది. అతను నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
244 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ తన వేగవంతమైన బౌలింగ్‌తో టాప్ ఆర్డర్‌ను కూల్చేశాడు. అభిషేక్ శర్మను బౌన్సర్‌తో ఔట్ చేసిన ఆర్చర్, అనంతరం ఇషాన్ కిషన్‌ను క్యాచ్ అవుట్ చేయించాడు. ట్రావిస్ హెడ్ కూడా అతని వేగాన్ని ఎదుర్కోలేక బౌల్డ్ అయ్యాడు. ఆర్చర్ దెబ్బకు హైదరాబాద్ పవర్‌ప్లే ముగిసే సరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ ముగిసేసరికి జట్టు 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం మధ్యవరుస పోరాడేందుకు ప్రయత్నించినా, అవసరమైన రన్‌రేట్ ఒత్తిడితో వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి 196 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్ రాయల్స్‌కు ఈ విజయం కేవలం మ్యాచ్ గెలుపు మాత్రమే కాదు. ఈ సీజన్ మొత్తం జట్టు చేసిన పోరాటానికి, యువ ఆటగాళ్ల ప్రతిభకు ఇది నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి క్వాలిఫయర్-2పై ఉంది. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఫైనల్ చేరాలని రాజస్థాన్ ఆశిస్తోంది. మొత్తంగా ఐపీఎల్ నుంచి హైదరాబాద్ జట్టు నిష్క్రమణ.. రాజస్థాన్ క్వాలిఫయర్-2లో అడుగుపెట్టడానికి ప్రధానంగా చిన్నోడు వైభవ్ సూర్యవంశీ బ్యాట్ ఒక కారణమైతే.. జోఫ్రా ఆర్చర్ బంతితో విరుచుకుపడడం రెండో ప్రధాన కారణాలుగా మారాయి..
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!