Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..
- బుమ్రా బౌలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్..
- అంత భీకరంగా లేదంటూ కామెంట్..
- విభిన్నంగా స్పందిస్తున్న ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగి రికార్డు సృష్టించిన ఈ యువ ఆటగాడు, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కోవడంపై తనదైన శైలిలో స్పందించాడు.
బుమ్రా బౌలింగ్ భీకరంగా ఏమీ లేదు..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బుమ్రాతో తలపడిన అనుభవం గురించి సూర్యవంశీ మాట్లాడుతూ.. “బుమ్రా బౌలింగ్ అంత భీకరంగా ఏమీ లేదు” అని వ్యాఖ్యానించాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా, తాను కేవలం బంతిపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించానని చెప్పాడు. తన కెరీర్లో తొలిసారి బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్‌ను ఎదుర్కొన్నప్పటికీ, ఏమాత్రం తడబడకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం విశేషం.
Also Read:Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..
మంగళవారం రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ముందుగా ఓపెనింగ్ బ్యాటింగ్‌కు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ దిగారు. మొదటి బంతి నుంచే సిక్సులు, ఫోర్లతో ఇద్దరు దూకుడుగా ఆడటంతో ఆ మ్యాచ్‌లో ఆర్ఆర్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓవర్లో మొదటి బంతికే సిక్స్ బాదాడు సూర్యవంశీ.
అంతే కాకుండా.. బుమ్రా వేసిన తొలి మూడు బంతుల్లోనే రెండు భారీ సిక్సర్లు బాదాడు వైభవ్ సూర్య వంశీ. ఐపీఎల్లో బుమ్రా లాంటి బౌలర్‌ను ఇలా ఎదుర్కోవడం అనుభవజ్ఞులైన ఆటగాళ్లకే సాధ్యం కాదు, కానీ చిన్న వయసులోనే సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఈ దూకుడు చూసి స్టేడియంలోని ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో వైరల్..
సూర్యవంశీ చేసిన ఈ ధీటైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఫ్యాన్స్ “14 ఏళ్ల కుర్రాడికి ఇంత ధైర్యమా?” అని ప్రశంసిస్తుంటే, బుమ్రా ఫ్యాన్స్ మాత్రం “నెక్స్ట్ మ్యాచ్‌లో బుమ్రా సమాధానం చెబుతాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. భయం లేకుండా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొనే సూర్యవంశీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. భారత క్రికెట్‌కు మరో స్టార్ దొరికాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్?
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!