Vaibhav Net Worth: “కోటీశ్వరుడే నండోయ్”.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Net Worth: ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ఊచకోత కోస్తున్నాడు. బుధవారం ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లగా, ఈ విజయానికి వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ప్రధాన కారణమైంది. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 97 పరుగులు బాది అతడు మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. చిన్నతనం నుంచే క్రికెటర్ కావాలని కలలుగన్న వైభవ్, 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2025 వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన అతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసి కోటీశ్వరుల జాబితాలో చేర్చింది.
ప్రస్థుతం 2026 సీజన్లోనూ అదే ఒప్పందంతో అతడు కొనసాగుతున్నాడు. వివిధ నివేదికల ప్రకారం.. ప్రస్తుతం వైభవ్‌కు ఐపీఎల్ జీతంతోపాటు అండర్-19 క్రికెట్ మ్యాచ్ ఫీజుల (అండర్-19లో ప్రతి మ్యాచ్‌కు రూ.20 వేలు) వస్తుంది. ఇక, ప్రస్తుత అంచనా నెట్‌వర్త్ (ఆస్తి విలువ) దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ఉంది. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. ఐపీఎల్లో అతడి అద్భుతమైన ప్రదర్శన కారణంగా ప్రముఖ బ్రాండ్ల దృష్టి అతడిపై పడింది. ఈ క్రమంలోనే 2026లో ‘జైడస్ వెల్నెస్’ సంస్థకు చెందిన ‘కాంప్లాన్’ (Complan) బ్రాండ్ అతడిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాకపోతే ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయ వివరాలు ఇంకా స్పష్టం కాలేదు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ అద్భుత ప్రగతి వెనుక వైభవ్ తండ్రి చేసిన ఎనలేని త్యాగం దాగుంది. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో 2011 మార్చి 27న జన్మించిన వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణ వ్యవసాయదారుడు. కొడుకు కలలను నిజం చేయడం కోసం ఆయన ఎలాంటి లోటూ రానివ్వలేదు. ఆఖరికి వైభవ్‌ను పాట్నాలో క్రికెట్ శిక్షణకు పంపేందుకు అవసరమైన డబ్బు కోసం తన సొంత భూమిని సైతం అమ్మేశారు. నాడు తండ్రి చేసిన త్యాగం, కొడుకు కలలకు ఇచ్చిన మద్దతు వల్లే నేడు వైభవ్ సూర్యవంశీ క్రికెట్ పిచ్‌పై ఈ రేంజ్లో ధూమ్ ధామ్ సృష్టిస్తున్నాడు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!