Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్‌తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: నిన్న (శుక్రవారం) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ఆ జట్టు ఐపీఎల్ ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ ఓటమి తాలూకు బాధ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. గుజరాత్ విజయం ఖరారైన కొన్ని నిమిషాలకే.. వైభవ్ రాజస్థాన్ డగౌట్లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనలో తాను బాధ పడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. మొదట తన ఆరెంజ్ క్యాప్‌తో కన్నీళ్లను దాచుకునే ప్రయత్నం చేసిన ఈ బుడ్డోడు, ఆ తర్వాత ఓటముని తట్టుకోలేక ముఖానికి టవల్ అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ ఒత్తిడితో కూడిన నాకౌట్ మ్యాచ్‌లోనూ వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తీవ్ర నిరాశే మిగిలింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 పరుగులతో చెలరేగిన వైభవ్, గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ భయం లేని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడినప్పటికీ, ఈ టీనేజ్ సంచలనం ఎదురుదాడికి దిగి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒక దశలో రాజస్థాన్ తక్కువ పరుగులకే కుప్పకూలేలా కనిపించినా, వైభవ్ మిడిల్ ఓవర్లలో గేర్ మార్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం వణకకుండా సంయమనం పాటిస్తూ గుజరాత్ బౌలింగ్ అటాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే, 18వ ఓవర్లో కాగిసో రబడా వేసిన షార్ట్ డెలివరీకి వైభవ్ అవుటయ్యాడు. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక, వైభవ్ ఆడిన చివరి నాలుగు ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ మార్కును తృటిలో చేజార్చుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కేవలం నాలుగు పరుగుల తేడాతో మరోసారి వంద పరుగుల మైలురాయిని అందుకోలేకపోయిన బాధ అతని ముఖంలో స్పష్టంగా తెలిసింది. దాంతో ఎంతో నిరాశగా, నెమ్మదిగా అతను మైదానాన్ని వీడాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Holding back tears, yet winning millions of hearts. 🥹💗
Vaibhav Sooryavanshi gave everything he had this season. Watching him emotional after the match was a reminder that behind the records, sixes and centuries is still a young boy carrying big dreams.
Keep your head high,… pic.twitter.com/WWGfm1x9ZZ— Yash Gupta (@iYashGupta_21) May 29, 2026
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?