SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Playoff Chances: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే-ఆఫ్ ప్రయాణం ఇప్పుడు కీలక మలుపునకు చేరుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ సేన అనూహ్యంగా కుప్పకూలింది. ఈ టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యల్ప స్కోరును నమోదు చేయడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ భారీ ఓటమి వల్ల సన్‌రైజర్స్ ప్లే-ఆఫ్ అవకాశాలు 80% నుంచి 65.7 శాతానికి పడిపోగా, మరోవైపు అద్భుత విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ 94.9% క్వాలిఫికేషన్ అవకాశాలతో దాదాపు నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. ఒక వేళ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచి ఉంటే పట్టికలో అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉండేది, కానీ 82 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్‌పై భారీ ప్రభావం పడింది. ప్రస్తుతం 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి.
ప్లే-ఆఫ్ చేరుకోవాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు ఇప్పుడు మూడు ప్రధాన దారులు ఉన్నాయి. మొదటిగా, మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే హైదరాబాద్ 18 పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రెండింటిలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే, పాయింట్లు 16 వద్ద నిలిచిపోతాయి. అప్పుడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిలో ఓడిపోవాలని హైదరాబాద్ కోరుకోవాల్సి ఉంటుంది. అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏమిటంటే.. ఒకవేళ సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే, వారు 14 పాయింట్ల వద్దే ఆగిపోతారు. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా చెన్నై తన చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోవాలి, అలాగే రాజస్థాన్ రాయల్స్ ఒక్క మ్యాచ్ కంటే ఎక్కువ గెలవకూడదు. ఇలాంటి పరిస్థితిలో ఒకటి కంటే ఎక్కువ జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉంటే, అప్పుడు నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. ఏదేమైనా, టోర్నీ చివరి దశలో సన్‌రైజర్స్ తలరాత వారి చేతుల్లోనే ఉన్నప్పటికీ.. తదుపరి మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా అవసరం.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!