RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మాట్లాడుతూ.. పిచ్ చాలా బాగుందని, మ్యాచ్ సాగుతున్న కొద్దీ పెద్దగా మారకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ స్టేడియంతో గత ఏడాదికి సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, ప్రస్తుతం తమ నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెడుతూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా అదే పాత విన్నింగ్ టీమ్‌తో బరిలోకి దిగుతోంది.
Also Read
- IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- RCB Vs GT: "అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం".. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: 'ఒక్కే ఒక్క కండీషన్..' వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిచినా మొదట బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. తొలి మూడు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుండి కొంత మూవ్మెంట్ లభించే అవకాశం ఉందన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ జట్టులో ఒక కీలక మార్పు చేశారు. సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు.
ఇరు జట్ల తుది ప్లేయింగ్ ఎలెవన్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవదూత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సాయ్ సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, అర్షద్ ఖాన్, కాగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని చూస్తుండగా, హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ తమ రెండో ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసింది. విరాట్ కోహ్లీ ఫామ్ ఆర్సీబీకి బలంగా మారగా.. రబాడ, గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లతో గుజరాత్ సైతం బలంగా కనిపిస్తోంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజేతగా నిలిచి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!