Sanju Samson: ధోనీ రికార్డు బద్దలు.. విమర్శకుల నోళ్లు మూయించిన సంజూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: చెన్నై సూపర్ కింగ్స్ ఖాతా తెరిచింది. 23 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిచింది. సీఎస్‌కే తరఫున ఆడిన నాలుగో మ్యాచ్‌లో సంజూ శామ్సన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బాల్స్‌లో 115 పరుగులు చేశాడు. 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది నాటౌట్‌గా నిలిచాడు. తన ఫామ్ గురించి వస్తున్న విమర్శలకు సంజూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. సీఎస్‌కే జెర్సీలో సంజూకి ఇదే తొలి సెంచరీ.. అంతేకాదు.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. గతంలో ఎంఎస్ ధోనీ (2019లో ఆర్సీబీపై 84 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఇక ఐపీఎల్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల (ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే) తరఫున సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా శామ్సన్ నిలిచాడు. అంతకుముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.
READ MORE: Trump: “అలా చేస్తే నా నెక్ట్స్ టార్గెట్ మీరే”.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సంజూ శుభారంభం ఇచ్చాడు. పవర్‌ప్లేలో గైక్వాడ్ నెమ్మదిగా ఆడినా, సంజూ మాత్రం దూకుడు పెంచాడు. అనంతరం యువ ఆటగాడు ఆయుష్ మ్హత్రేతో కలిసి రెండో వికెట్‌కు కేవలం 11 ఓవర్లలోనే 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్హత్రే అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, సంజూ తన క్లాస్ షాట్లతో హోమ్ గ్రౌండ్ అభిమానులను అలరించాడు. ఈ సీజన్ ఆరంభంలో తడబడిన సంజూ, ఈ సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి రావడమే కాకుండా ‘అన్బుడెన్’ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ సాయంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేజింగ్ బరిలోకి దిగిన ఢిల్లీ 189 పరుగులకే కుప్పకూలింది.
READ MORE: RamCharan: మెగా పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. భన్సాలీ భారీ ప్రాజెక్ట్ లో చరణ్?
తాజావార్తలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
-
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!