Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricket Love Storie: క్రికెట్ ప్లేయర్స్‌కు సంబంధించిన లవ్ స్టోరీలు బాగా వైరల్ అవుతుంటాయి. ప్లేయర్స్ పర్ఫామెన్స్ కంటే వీటిపైనే కొంత మంది ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. అలాంటి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున యువ ఆల్ రౌండర్ సమీర్ రిజ్వీ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పుడు మైదానంలో తన ఆట కంటే బయట ఓ వివాదం కారణంగా వార్తల్లో నిలిచాడు రిజ్వీ. ప్రముఖ ఇండో-కెనడియన్ స్పోర్ట్స్ యాంకర్ యెషా సాగర్‌తో రిజ్వీ ప్రేమాయణంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక వీరి వయసు విషయానికి వస్తే.. సమీర్ రిజ్వీ 22 ఏళ్లు కాగా.. యెషా సాగర్‌కు 29 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం క్రికెటర్, లీగ్ బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో పనిచేస్తున్న ఒక హిందూ స్పోర్ట్స్ యాంకర్‌తో ప్రేమలో ఉన్నాడు. కానీ ఆ సంబంధంలో కొన్ని వ్యక్తిగత, మతపరమైన అంశాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఉన్నాయని ఓ జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఈ చర్చకు దారితీసింది.
సదరు జర్నలిస్ట్ తన పోస్ట్‌లో ఎవరి పేర్లను నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆ యాంకర్ స్నేహితురాలి ద్వారా తెలిసిన సమాచారం అంటూ కొన్ని సంచలన విషయాలను పేర్కొన్నారు. ఆ క్రికెటర్ తన వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఆ యాంకర్‌పై రుద్దుతున్నాడు. సోషల్ మీడియాలో ఆమె ప్రవర్తన, ఇతరులతో సామాజిక సంబంధాలపై కొన్ని ఆంక్షలు సైతం విధించాడని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం పరస్పర అంగీకారంతో జరుగుతోందా లేదా అన్నది సంబంధిత వ్యక్తులు స్పందిస్తేనే తెలుస్తుందని ఆ జర్నలిస్ట్ వెల్లడించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అటు సమీర్ రిజ్వీ కానీ, ఇటు యేషా సాగర్ కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక, ప్రస్తుతం సమీర్ రిజ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 149.28 స్ట్రైక్ రేట్‌తో రెండు హాఫ్ సెంచరీల సాయంతో 209 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. 2024లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రిజ్వీ, మొత్తం 21 మ్యాచ్‌లలో 381 పరుగులు సాధించాడు. మే 1వ తేదీ శుక్రవారం నాడు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు సిద్ధమవుతుండగా, బయట వినిపిస్తున్న ఈ రూమర్లు సమీర్ రిజ్వీని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. కేవలం సోషల్ మీడియా ప్రచారం ఆధారంగానే ఈ వార్తలు వస్తున్నందున, ఇందులో నిజమెంత ఉందనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!