IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుస పరాజయాలతో ఒత్తిడిలో పడింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీకి ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. జట్టు మొత్తం బాగానే ఆడుతున్నప్పటికీ, ఇద్దరు కీలక ఆటగాళ్ల పేలవ ఫామ్ ఇప్పుడు జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. వారు జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్.
జితేష్ శర్మ మరోసారి విఫలం
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో జితేష్ శర్మపై ఆర్సీబీ భారీ ఆశలు పెట్టుకుంది. మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేసి మ్యాచ్‌ను ముగిస్తాడని భావించిన జితేష్, మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అయితే, ఆర్సీబీ యాజమాన్యం జితేష్‌ను భారీగా రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ, ఈ సీజన్లో అతని ప్రదర్శన మాత్రం ఆ అంచనాలకు ఏమాత్రం సరిపోలలేదు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ కూడా 108.47గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మాత్రం జితేష్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌ల్లో 261 పరుగులు చేసి 176.35 స్ట్రైక్‌రేట్‌తో మెరిశాడు. కానీ ఈసారి అతని ఫామ్‌లో స్పష్టమైన క్షీణత కనిపిస్తోంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
రొమారియో షెపర్డ్ కూడా ఫామ్‌లో లేడు
మరోవైపు ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. లక్నోతో మ్యాచ్‌లో 15 బంతుల్లో 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా, జట్టును గెలిపించలేకపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్, డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం కారణంగా షెపర్డ్‌ను ఆర్సీబీ కీలక ఫినిషర్‌గా భావించింది. అతడిని రూ.1.50 కోట్లకు జట్టులో కొనసాగించింది. కానీ ఈ సీజన్లో అతను 10 మ్యాచ్‌ల్లో కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 143.64గా ఉంది. బౌలింగ్‌లో కూడా ప్రభావం చూపలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీసి, 12.94 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఒక ఆల్‌రౌండర్‌కు ఇవి సరైన గణాంకాలు కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం
వరుస వైఫల్యాల నేపథ్యంలో జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్లపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆర్సీబీ వెంటనే మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇద్దరు ఆటగాళ్లు త్వరగా ఫామ్‌లోకి రాకపోతే జట్టులో వారి స్థానాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐపీఎల్లో వారి రికార్డులు
జితేష్ శర్మ ఇప్పటివరకు 65 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 22.44 సగటుతో 1055 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 152.89గా ఉంది. రొమారియో షెపర్డ్ మొత్తం 28 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 185.91 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడంతో పాటు కీలక వికెట్లు కూడా తీశాడు. అయినప్పటికీ ఈ సీజన్లో మాత్రం ఇద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఆర్సీబీకి భారంగా మారారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?