Longest IPL Match: “4 గంటల 23 నిమిషాలు”.. ధురందర్ 2 కంటే ఎక్కువ సేపు సాగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Longest IPL Match Without A Super Over: టీ20 ఫార్మాట్ అంటేనే వేగం.. ఐపీఎల్‌లో వేగం ఇంకా పెరుగుతోంది. కొన్ని గంటల్లోనే ఫలితం తేలిపోతుంది. కానీ ఐపీఎల్‌లోని ఒక మ్యా్చ్ మాత్రం గంటల తరబడి సాగింది. అదేదో కాదు.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్. అసలు సూపర్ ఓవర్ లేకుండానే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఇంత సుదీర్ఘంగా సాగడం టోర్నీ చరిత్రలోనే ఇదే తొలిసారి. రాత్రి 7 గంటలకు టాస్‌తో మొదలైన ఈ హై-వోల్టేజ్ డ్రామా, చివరి బంతి పడేసరికి రాత్రి 11:45 దాటిపోయింది. అంటే సుమారు 4 గంటల 23 నిమిషాల పాటు సాగింది. ఇక ఈ మ్యాచ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య సోషల్ మీడియాలో సెటైరికల్‌గా స్పందించారు. సుమారు మూడు గంటల యాభై నిమిషాల నిడివి ఉండే ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా కంటే ఈ మ్యాచే పెద్దదని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నవ్వులు పూయిస్తోంది. క్రికెట్ అభిమానులు ఈ వ్యాఖ్యపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో మొత్తం 4 ఎక్స్‌ట్రాలు (Extras) వచ్చాయి (1 బై, 3 వైడ్లు). ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 ఎక్స్‌ట్రాలు (Extras) వచ్చాయి (1 బై, 1 లెగ్ బై, 13 వైడ్లు). వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం వేడి వాతావరణం, సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులని నిపుణులు చెబుతున్నారు. అదనంగా, టాస్ సమయంలో సాంకేతిక సమస్యలు, ఇరు జట్ల కెప్టెన్లు క్రీజులో ఎక్కువ సమయం తీసుకోవడం కూడా కొంతవరకు ఆలస్యానికి కారణమైంది.
READ MORE: Astrology: ఏప్రిల్ 14, మంగళవారం దినఫలాలు.. మీది ఈ రాశా..? అయితే కాస్త జాగ్రత్త..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ సుదీర్ఘ పోరాటంలో చివరకు ఆర్సీబీదే పైచేయి అయింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించిన బెంగళూరు, ఈ మైదానంలో తన అత్యధిక స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లు ముంబై బౌలర్లను చీల్చిచెండాడారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 36 బంతుల్లో 78 పరుగులతో విరుచుకుపడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిస్తే, కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 20 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ముఖ్యంగా పాటిదార్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబైని కట్టడి చేయడంలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా (1/26), సుయాష్ శర్మ (2/47) కీలక పాత్ర పోషించారు.
Another record for the IPL. The first match which was longer than Dhurandhar 2!
— Joy Bhattacharjya (@joybhattacharj) April 12, 2026
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!