RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ సీజన్ మొత్తానికి దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ జాకబ్ బెథెల్ గాయం కారణంగా ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సైతం దూరమైన బెథెల్, త్వరలోనే ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లనున్నాడు. అక్కడ తన జాతీయ జట్టు సిరీస్‌ల కంటే ముందు కోలుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్లేఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్‌తో అత్యంత కీలకమైన ‘క్వాలిఫైయర్ 1’ మ్యాచ్ ఆడటానికి ఆర్సీబీ సిద్ధమవుతున్న తరుణంలో ఈ వార్త రావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని బెంగళూరు జట్టు… తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ చేరింది.
అసలు జాకబ్ బెథెల్‌కు ఏం జరిగిందంటే..?
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ, ఒక క్యాచ్ అందుకోవడానికి డైవ్ చేసిన సమయంలో అతని ఎడమచేతి ఉంగరపు వేలికి బలమైన గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం, ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ దృష్ట్యా తదుపరి చికిత్స కోసం అతను స్వదేశానికి తిరిగి వెళ్తున్నట్లు శనివారం (మే 23న) ఆర్సీబీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఇటు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. బెథెల్‌ను విడుదల చేసేందుకు ఆర్సీబీతో ఒప్పందం కుదిరిందని, జూన్ 4 నుంచి లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అనేది వైద్య బృందం పరిశీలన తర్వాత తెలుస్తుందని ఈసీబీ పేర్కొంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
బెథెల్ దూరం కావడం మైనస్ అయినప్పటికీ, ఆర్సీబీ జట్టుకు ఒక భారీ ఊరట లభించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మొదటి ప్లేఆఫ్ మ్యాచ్ సమయానికి స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తిరిగి జట్టులోకి రానున్నాడు. దాంతో అతను నేరుగా తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సాల్ట్ అందుబాటులో లేకపోవడంతో, ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి కేవలం 19 బంతుల్లోనే 44 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఇప్పుడు ఫిల్ సాల్ట్ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వస్తుండటంతో, వచ్చే మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్‌ను మిడిల్ ఆర్డర్లో పంపి, సాల్ట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించేలా ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!