Rajat Patidar: కోహ్లీ వల్ల కాదు.. ఆ ‘స్టన్నింగ్ క్యాచ్’ వల్లే మ్యాచ్ గెలిచాం.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సమష్టిగా రాణించిన రజత్ సేన మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్ల అసాధారణ ప్రదర్శన, మంచి ఫీల్డింగ్‌తోనే విజయం సాధించామని చెప్పాడు. “ఫిల్ సాల్ట్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. టాస్ గెలవడం ఈ మ్యాచ్‌లో కలిసి వచ్చింది. ఇక మా టీమ్‌లో ఫాస్ట్ బౌలర్లు బాగా రాణించారు. కండీషన్స్‌కు తగ్గట్టు బౌలింగ్ వేశారు. కృనాల్ ధైర్య వంతుడు. ఎలాంటి బాల్స్ వేస్తాడో నాకు కూడా తెలియదు. సుయాష్ శర్మ స్టంప్-టు-స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్‌వుడ్ సైతం అదరగొట్టారు. ఒక కెప్టెన్‌గా ఇలాంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. వీళ్ల వల్ల నా పని చాలా ఈజీగా మారుతుంది. ఎందుకంటే నెక్ట్స్ ఓవర్‌లో ఎలా బౌలింగ్ చేయాలో వాళ్లకు చెప్పనవసరం లేదు. వాళ్లకు ఉన్న అనుభవం, ఆలోచనలు ఇతర బౌలర్లకు కూడా ఎంతో సహాయపడుతున్నాయి. ఈ సీజన్ ఆరంభం నుంచే మా ఫీల్డింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. దానికి తగ్గట్టుగానే ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. ఈ రోజు సాల్ట్ తీసుకున్న క్యాచ్ చాలా గొప్పది.” అని కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.
READ MORE: Nicholas Pooran: దాచడానికి ఏముంది, మేం చెత్తగా ఆడాం.. లక్నో కెప్టెన్ పూరన్!
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (38) మినహా మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ (4/24) నాలుగు వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తృటిలో ఓ రికార్డును మిస్ చేసుకున్నాడు. తన 66వ ఐపీఎల్ హాఫ్ సెంచరీకి కేవలం ఒక పరుగు దూరంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్ ఆన్ వద్ద నికోలస్ పూరన్‌కు చిక్కాడు. కోహ్లీ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్ కీపర్ జితేష్ శర్మ (23) వేగంగా పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆర్‌సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.
తాజావార్తలు
-
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
-
Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
-
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు సీరియస్..
-
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
-
Rahul Gandhi: “అమిత్ షా పోలీసులతో మాట్లాడటం నేను చూశాను”.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!