Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muttiah Muralitharan: ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. ఇందులో క్రికెట్ ఎక్కడ ఉందని లెజెండరీ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఇక, ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల సునామీ క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం చూస్తుంటే.. అసాధ్యం అనుకున్నవి అత్యంత సహజంగా మారిపోయాయని అర్థమవుతోంది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే 265, 244, 229 వంటి భారీ స్కోర్లు ఛేజ్ అవ్వడం ఐపీఎల్‌లోనే అరుదైన రికార్డులు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య అసమతుల్యతపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. బ్యాటింగ్ సరళి మారిపోయింది. ఇక బౌండరీలు వెనక్కి జరపాలా? అన్న అంశంపై తాజాగా సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్, స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఇచ్చిన సమాధానం క్రీడాభిమానులను ఆలోచింపజేస్తోంది.
బౌండరీల దూరం పెంచడం వల్ల పెద్దగా మార్పు ఉండదని, అసలు సమస్య పిచ్‌లలో ఉందని మురళి అభిప్రాయపడ్డారు. “పిచ్‌లను బౌలర్లకు అనుకూలంగా మారిస్తే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. టీ20 అభిమానులు వినోదాన్ని కోరుకుంటారు. వాళ్లకు కావాల్సింది ఫోర్లు, సిక్సర్లే. ఈ టోర్నీని వినోద సాధనంగా (Entertainment Product) చేశారు తప్ప, క్రికెట్ అభివృద్ధి కోసం కాదు. ప్రస్తుతం ఇది ఒక భారీ వ్యాపారం” అని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన రాకతో జట్లకు అదనపు బ్యాటర్ అందుబాటులోకి వచ్చాడని, దీనివల్ల వికెట్లు కాపాడుకోవాలనే భయం లేకుండా బ్యాటర్లు తొలి బంతి నుంచే విరుచుకుపడుతున్నారని విశ్లేషించారు. ఐపీఎల్ యాజమాన్యం సైతం ఈ నిబంధనను కనీసం 2027 వరకు కొనసాగించాలని నిర్ణయించడం వెనుక ఉన్న వ్యాపార కోణాన్ని మురళి స్పష్టంగా వివరించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ ఇప్పుడు మహిళలు, యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక సర్వే ప్రకారం.. 18-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతలో ఐపీఎల్ క్రేజ్ 68% మేర పెరిగింది. ఈ కొత్త తరం ప్రేక్షకులకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మెరుపులు, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి కుర్రాళ్ల విధ్వంసకర హిట్టింగ్ అంటేనే ఎక్కువ ఆసక్తి పెరిగిందని మురళి తెలిపారు. ఈ పరుగుల వరద చూసి కొందరు కోచ్‌లు ఆందోళన చెందుతున్నప్పటికీ.. ప్రేక్షకులు దీన్ని ఆస్వాదిస్తున్నంత కాలం ఈ ధోరణి మారదని అర్థమవుతోందన్నారు. ప్రస్తుత బ్యాటింగ్ దూకుడును చూస్తుంటే, తనతో పాటు షేన్ వార్న్ వంటి దిగ్గజాలు బౌలింగ్ చేసినా ఈ పిచ్‌లపై పెద్దగా ప్రభావం చూపలేరని మురళి నిజాయితీగా ఒప్పుకున్నారు. “మేము బంతిని తిప్పగలమేమో కానీ, ఒక్కో ఓవర్‌లో 10 పరుగులు చొప్పున 40 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చేది. స్కోరును 200 లోపు నియంత్రించాలంటే మా లాంటి బౌలర్లు ముగ్గురు నలుగురు ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!