Mumbai Indians: రోహిత్ నిరాశ.. హార్దిక్ నిరుత్సాహం.. బుమ్రా నిస్సహాయత.. ముంబైలో అంతా గందరగోళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians in Crisis: ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్(MI) జట్టులో ఏ ఒక్క ఆటగాడు సంతోషంగా లేడు. రోహిత్ శర్మ గాయపడటం, జస్ప్రీత్ బుమ్రా వికెట్ల కోసం తడబడుతున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి సైతం చాలా యాతన అనుభవిస్తున్నాడు. తన ప్రధాన అస్త్రాలైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడంతో డీలా పడిపోయాడు. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సేనను అడ్డుకోవడంలో ముంబై ఘోరంగా విఫలమైంది. నిన్నటి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ప్లేయర్ సహనం కోల్పోయారు. భావోద్వేగాలు సైతం అదుపు తప్పాయి. హార్దిక్ ఫీల్డింగ్ సెట్ చేయడంలో రోహిత్ కోపంగా కనిపించాడు. మరోవైపు.. బుమ్రా ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. అసలు 12 మంది సభ్యుల బృందంలో లేకపోయినప్పటికీ, డగౌట్ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న రోహిత్ తన అసంతృప్తిని దాచుకోలేకపోయాడు. మ్యాచ్ మధ్యలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా వదిలేయడంతో కెప్టెన్ హార్దిక్ తీవ్రంగా కోపగించుకున్నాడు. బుమ్రా క్షమాపణలు కోరినప్పటికీ.. ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుతాలు చేయలేకపోయాడు. అదే ఫీలింగ్‌లో ఉండిపోయినట్లు కనిపించింది.
READ MORE: Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు.. ఒకరు అరెస్ట్
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అనహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం చెప్పడానికి ఏమీ మిగల్లేదని విచారం వ్యక్తం చేశాడు. “నిజం చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడటానికి మాటలు రావడం లేదు. మళ్ళీ మొదటి నుంచి అన్నీ సమీక్షించుకోవాలి. లోపం ఎక్కడ ఉందో వెతకాలి.. అది వ్యక్తిగత ప్రదర్శనలోనా? జట్టు వ్యూహాల్లోనా? అనేది తేల్చాలి” అని హార్దిక్ అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో జట్టులో భారీ మార్పులు ఉంటాయని, కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హింట్ సైతం ఇచ్చేశాడు. ఇక టీమ్‌లోని జట్టులో ఉన్న స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు తమ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వీరిని రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయక తప్పదని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై, ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?