Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Create History: ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్‌లో దారుణంగా మారింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. అయితే.. ఈ పరాజయంలోనూ ముంబై ఇండియన్స్ ఓ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 50,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అరుదైన ఘనత సాధించడానికి ముంబైకి ఈ మ్యాచ్‌లో 114 పరుగులు అవసరం కాగా, 15వ ఓవర్లో ఆ మైలురాయిని చేరుకుంది.
ముంబై ఇండియన్స్‌కు ఇది 308వ టీ20 మ్యాచ్ (286 ఐపీఎల్ మ్యాచ్‌లు, 22 ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్‌లు). టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సోమర్‌సెట్ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్ (46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అయితే, ఈ చారిత్రాత్మక రికార్డు ముంబైకి తీపి జ్ఞాపకాన్ని మిగిల్చినా, మ్యాచ్ ఫలితం మాత్రం చేదుగా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 18.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (67), కార్తీక్ శర్మ (54) అర్ధసెంచరీలతో చెన్నైకి విజయాన్ని అందించారు. ఈ ఓటమితో ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబైకి ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ప్రస్తుతం 8 మ్యాచ్‌లలో కేవలం 4 పాయింట్లతో ఉన్న ముంబై, మిగిలిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే గరిష్టంగా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉండేది. కానీ చెన్నై చేతిలో ఓటమితో ఇప్పుడు ముంబై గరిష్టంగా 14 పాయింట్లను మాత్రమే సాధించగలదు, ఇది ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి సరిపోదు.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?