Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumar Sangakkara: రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరడంపై ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలను హెడ్ కోచ్ కుమార్ సంగక్కర పూర్తిగా వ్యతిరేకించారు. ఈ ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో విజయం సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫైయర్-2కు దూసుకెళ్లింది. అయితే, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ చేతిలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టులో యువకులు, అనుభవం లేని ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల తాము ప్లేఆఫ్స్ చేరుతామని అసలు ఊహించలేదని కెప్టెన్ రియాన్ పరాగ్ వ్యాఖ్యానించాడు. దీనిపై మీడియా ప్రతినిధులు హెడ్ కోచ్ సంగక్కరను ప్రశ్నించగా.. ఆయన కెప్టెన్ అభిప్రాయంతో ఏమాత్రం ఏకీభవించలేదు.
“గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆలోచన విధానం వేరుగా ఉండి ఉండవచ్చు, కానీ 2022లో మేం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. ఆ మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేశాం. కేవలం మ్యాచ్‌లను గెలిపించడమే కాకుండా, వెంటనే బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్లనే జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా వ్యూహం ఎప్పుడూ అలానే ఉంటుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లాంటి అద్భుతమైన ఆటగాడు జట్టులోకి రావడం విశేషమే కావచ్చు, కానీ అతను మా ఫస్ట్ ఎలెవన్ (తుది జట్టు)లో ఆడేందుకు పూర్తిగా అర్హుడనే నమ్మకంతోనే మేం అతన్ని కొనుగోలు చేశాం” అని సంగక్కర స్పష్టం చేశారు. ఆటగాళ్ల అభివృద్ధి (డెవలప్మెంట్) అనే కోణం గురించి సంగక్కర మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఫ్రాంచైజీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. అయితే, రెండేళ్ల క్రితం జరిగిన వేలంలో (ఆక్షన్) డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడంలో తాము కొంత తడబడ్డామని అంగీకరించారు. ఒక్కోసారి అలా జరగడం సహజమేనని, అయితే ఇప్పుడు జట్టులో ఆడుతున్న వారంతా గెలవాలనే కసితోనే బరిలోకి దిగుతున్నారని, ఇక్కడ అనుభవలేమి అనేది పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
రాజస్థాన్ కెప్టెన్, హెచ్ కోచ్ సంగక్కర మధ్య సఖ్యత లేదనే వాదన మొదలైంది. ఇక వెంటనే.. ప్లేఆఫ్స్ వ్యాఖ్యలపై కెప్టెన్‌తో విభేదించినప్పటికీ.. ఈ సీజన్లో మొదటిసారి పూర్తిస్థాయిలో జట్టును నడిపించిన రియాన్ పరాగ్ కెప్టెన్సీని సంగక్కర మనస్ఫూర్తిగా అభినందించారు. బయట ఉన్నవారు తమ జట్టుపై నమ్మకం ఉంచకపోయినా, రాజస్థాన్ రాయల్స్ ఆ విమర్శలను తిప్పికొట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. “కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌కు ఇది మొదటి సీజన్ అయినప్పటికీ ఎంతో అద్భుతంగా నడిపించాడు. మైదానంలో అతను తీసుకున్న నిర్ణయాలు, జట్టును మేనేజ్ చేసిన విధానం చాలా బాగున్నాయి. ఈ అనుభవంతో అతను, మిగిలిన ఆటగాళ్లు భవిష్యత్తులో మరింత నేర్చుకుని, వచ్చే సీజన్లో మరింత బలంగా పునరాగమనం చేస్తారు. టోర్నీ మొదలైనప్పుడు మేము ప్లేఆఫ్స్ చేరుతామని ఎవరూ నమ్మలేదు. కానీ కష్టపడి, మంచి క్రికెట్ ఆడుతూ, ఆటను ఆస్వాదిస్తే.. ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చని మా జట్టు నిరూపించింది” అని సంగక్కర వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?