IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఐపీఎల్లో ఏదైనా సాధ్యం. కొత్త బౌలర్లు, బ్యాటర్లకు ఈ సిరీస్ ఓ సువర్ణ అవకాశంగా చెప్పాలి. ఇక ఈ సీజన్ మాత్రం బౌలర్లకు ఓ పీడకలలా మారుతోంది. స్టేడియంలో పరుగుల వరద పారుతుండటంతో ఏ స్కోరూ సేఫ్ కాదని అర్థమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా 264 పరుగులు చేసినా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడం, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 243 పరుగులు చేసి ఓటమిని చవిచూడటం చూస్తుంటే బ్యాటర్ల వీరవిహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ అలవోకగా ఛేజ్ చేసింది. చిత్రమేమిటంటే.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లను విజయవంతంగా ఛేజ్ చేసిన టాప్-5 మ్యాచ్‌లలో మూడు ఈ ఒక్క సీజన్ లోనే నమోదయ్యాయి.
ఐపీఎల్లో జరుగుతున్న ఈ పరుగుల వేటను చూసి ఐస్లాండ్ క్రికెట్ తనదైన శైలిలో సెటైర్లు వేసింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్లో ఏదైనా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి సేఫ్ జోన్లో ఉండాలంటే కనీసం 350 పరుగులు చేయాలి’ అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సీజన్లో కేవలం 41 మ్యాచ్‌లు ముగిసే సమయానికే 10 సార్లు 200కు పైగా టార్గెట్లు ఛేజ్ అయ్యాయి. ఇది ఒక సరికొత్త ఐపీఎల్ రికార్డ్. ఇంకా ఈ సీజన్లో 33 మ్యాచ్‌లు మిగిలే ఉండటం విశేషం. గత ఏడాది అంటే 2025లో మొత్తం 74 మ్యాచ్‌ల్లో 9 సార్లు మాత్రమే ఈ ఘనత నమోదైతే, ఈసారి సగం సీజన్‌కే ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గత రెండు సీజన్లలో కలిపి జరిగిన 19 భారీ రన్ ఛేజ్‌లలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే చివరి ఓవర్ వరకు వెళ్లాయంటే, బ్యాటర్లు ఎంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో 2023లో 8 సార్లు, 2024లో 6 సార్లు మాత్రమే 200+ స్కోర్లు ఛేజ్ అయ్యాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
These days a team needs at least 350 batting first in the IPL to feel safe.
— Iceland Cricket (@icelandcricket) April 29, 2026
తాజావార్తలు
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!