IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ప్రదర్శనపై వస్తున్న విమర్శలను ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ ఖండించారు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్, యువ ప్రతిభను వెలికితీయడంలో ఎప్పుడూ ముందుంటుంది. 2024 సీజన్‌లో తన బుల్లెట్ వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచిన మయాంక్ యాదవ్, ఆ తర్వాత గాయాల బారిన పడి దాదాపు 353 రోజుల పాటు మైదానానికి దూరమయ్యాడు. తీవ్రమైన వెన్నునొప్పితో కెరీర్ ప్రమాదంలో పడిన తరుణంలో.. ఎంతో కష్టపడి కోలుకుని రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ తన పూర్తి కోటా 4 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చాడు. దురదృష్టవశాత్తూ అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ముఖ్యంగా తన చివరి ఓవర్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై విమర్శల వర్షం కురిపించారు. వికెట్లు తీయకుండా ఇన్ని పరుగులు ఇస్తావా అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అంతే కాదు ఇంకొంతమంది నెటిజన్లు ‘నీకు బౌలింగ్ రాదు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’ అంటూ విమర్శిస్తున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇయాన్ బిషప్ అండ..
ఈ విమర్శలపై వెస్టిండీస్ మాజీ దిగ్గజం ఇయాన్ బిషప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటుగా సమాధానమిచ్చారు. “మయాంక్ యాదవ్‌పై వస్తున్న నెగెటివ్ కామెంట్లను చూడటం భయానకంగాఉంది. 21 ఏళ్ల వయసులో అతడు దాదాపు తన కెరీర్‌ను, జీవనోపాధిని కోల్పోయే స్థితికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల నుంచి కోలుకుని మళ్ళీ మైదానంలోకి రావడం పెద్ద విషయం. అతడు మళ్ళీ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలగడం ఒక అద్భుతం. ప్రస్తుతం అతడు ఫిట్‌గా ఉండాలని కోరుకోండి, లైన్ అండ్ లెంగ్త్‌పై నియంత్రణ మెల్లగా వస్తుంది” అని బిషప్ అతడికి మద్దతుగా నిలిచారు.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?