SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్సాహభరితంగా సాగుతోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన 45వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైనప్పటికీ, వ్యక్తిగత ప్రదర్శనలో అభిషేక్ శర్మ తన ముద్రను వేయగలిగాడు. తన దూకుడుతో కూడిన బ్యాటింగ్ శైలి ద్వారా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానానికి చేరుకుని, ప్రతిష్టాత్మకమైన ‘ఆరెంజ్ క్యాప్’ ను దక్కించుకున్నాడు. అంతక ముందు ఇది కేఎల్ రాహుల్ దగ్గర ఉండగా.. నేడు 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మకు ఈ క్యాప్ మళ్లీ వచ్చింది. జట్టు విజయానికి దూరమైనా, అతని వ్యక్తిగత ప్రతిభ మాత్రం ఈ సీజన్‌లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిషేక్ శర్మ ఒక పవర్‌హౌస్‌లా కనిపిస్తున్నాడు. అతని గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 10 మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ మొత్తం 440 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. 48.89 సగటుతో పరుగులు సాధిస్తూ నిలకడను ప్రదర్శిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా 206.57 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ సీజన్‌లో అతని అత్యుత్తమ స్కోరు 135 నాటౌట్. ఇప్పటివరకు 1 సెంచరీ మరియు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్‌లలో మొత్తం 41 ఫోర్లు మరియు 32 సిక్సర్లు బాదాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
కేఎల్ రాహుల్ (433 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (425 పరుగులు) వంటి దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి అభిషేక్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కేకేఆర్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ.. అభిషేక్ వ్యక్తిగత పోరాటం ఆరెంజ్ క్యాప్ రూపంలో ఫలించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతడు ప్రధాన బలంగా మారాడు. అతని దూకుడు ఇలాగే కొనసాగితే ఈ సీజన్ ముగిసేసరికి మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వరుస విజయాలతో దూసుకుపోతూ, ఈ మ్యాచ్‌లో గెలిచి ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆశలపై కేకేఆర్ నీళ్లు చల్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కోల్‌కతా, అనంతరం 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అంగ్క్రిష్ రఘువంశీ (59) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, అజింక్య రహానే (43) అతనికి చక్కని సహకారం అందించారు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ విజయ పరంపరకు బ్రేక్ పడటమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లే అవకాశం చేజారింది. కేకేఆర్ బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించి హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపారు.
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!