Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్‌లోకి కూడా చేరిన అభిషేక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ రెండో బంతికే అర్ష్‌దీప్ సింగ్‌ను సిక్సర్‌తో పలకరించిన అతను, ఆ తర్వాత మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో కూడా భారీ సిక్సర్లు బాదాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఈ చిన్న ఇన్నింగ్స్‌తోనే అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారతదేశంలో జరిగిన టీ20 మ్యాచుల్లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఆరో బ్యాటర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 388 సిక్సర్లతో అందరికంటే ముందుండగా.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు అభిషేక్ చేరాడు. కేవలం 153 మ్యాచుల్లోనే అతను 302 సిక్సర్ల మార్కును అందుకోవడం విశేషం.
Also Read
- Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్‌కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్‌కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
అభిషేక్ ఇచ్చిన ఊపును హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ కొనసాగించారు. క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు చేయగా, కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. పంజాబ్ ఫీల్డర్లు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న వీరిద్దరూ సన్‌రైజర్స్ స్కోరును 235 పరుగులకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడంతో అతని కష్టానికి ఫలితం దక్కలేదు. మొత్తానికి సన్‌రైజర్స్ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలింగ్ తేలిపోయింది.
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్‌కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!