IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
- మరింత ఉత్కంఠభరిత దశకు ఐపీఎల్ 2026
- 16 పాయింట్లు సాధిస్తేనే టాప్-4లో స్థానం
- టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Playoffs Scenarios for 10 Teams: ఐపీఎల్ 2026 సీజన్ మరింత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కనీసం 16 పాయింట్లు సాధిస్తేనే టాప్-4లో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జట్టుకూ ఇక నుంచి ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. టాప్ జట్లు తమ స్థానం కాపాడుకునేందుకు పోరాడుతుండగా.. మిగతా జట్లు చివరి ఆశతో బరిలోకి దిగుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికను మార్చే అవకాశముండటంతో.. అభిమానులకు ఉత్కంఠభరిత క్రికెట్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీగా కనిపిస్తోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముందంజలో ఉన్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడం చాలా సులభం అనే చెప్పాలి. ఆరు విజయాలతో 13 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే సరిపోతుంది. ఒక్క విజయం సాధిస్తే మిగతా జట్ల సమీకరణాలపై పడాల్సి ఉంటుంది. 12 పాయింట్స్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు తప్పనిసరి. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విన్స్ అవసరం. ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చాలా దగ్గరలో ఉన్నాయి.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
9 మ్యాచ్‌ల్లో 10 పాయింట్స్ ఖాతాలో వేసుకున్న గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కాస్త కఠినంగా ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో కనీసం మూడు విజయాలు సాధించాల్సి ఉంది. 8 పాయింట్స్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. 8 మ్యాచ్‌లలో మూడు విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు తప్పనిసరి. ఈ మూడు జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నప్పటికీ కాస్త కష్టమనే చెప్పాలి. గుజరాత్ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ఈ మూడు జట్లు మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గెలవాల్సి ఉంది. ఒక్క ఓటమి ఈ జట్ల అవకాశాలను దెబ్బతీస్తుంది. ఇక నుంచి కోల్‌కతా, ముంబై, లక్నోలాక్ డూ ఆర్ డై పరిస్థితి. ప్రస్తుత ఫామ్ చూస్తే.. అన్ని విజయాలు కష్టమే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ మూడు జట్లు ఇప్పటికే ఇంటిదారి పట్టాయి.
తాజావార్తలు
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్‌లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
-
Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్‌కు కొత్త కెప్టెన్..
-
Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!