IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
- చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం
- ఆసక్తికర మలుపు తిరిగిన ప్లేఆఫ్స్ రేసు
- ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Playoff Chances: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన ఘన విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ గెలుపుతో హైదరాబాద్‌కే కాకుండా.. గుజరాత్ టైటాన్స్‌కు కూడా ప్లేఆఫ్స్ బెర్తు అధికారికంగా ఖరారైపోయింది. ప్రస్తుతం ఈ రెండు జట్లూ చెరో 16 పాయింట్లతో ముందంజ వేసి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాయి. టోర్నీలోని మిగతా జట్లలో కేవలం రాజస్థాన్ రాయల్స్‌కు మాత్రమే 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండడంతో.. హైదరాబాద్, గుజరాత్ల స్థానాలకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లు తీవ్ర నిరాశపరిచాయి. ఇరు జట్లు పేలవ ప్రదర్శన కనబరిచి.. చాలా ముందే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతుండడంతో లీగ్ దశ ముగింపు మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. రాజస్థాన్ జట్టు ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు తన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు మిగతా నాలుగు జట్లు ఇంటికి వెళ్లాల్సిందే. ఒకవేళ ఓ మ్యాచ్ ఓడితే మాత్రం రేసు మరింత రసవత్తరం అవుతుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఒక్కో మ్యాచ్ ఉంది. అన్ని జట్లు తమ చివరి మ్యాచ్‌లో గెలవడమే కాకుండా.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా అనుకూలంగా వస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇప్పుడు ఈ జట్ల భవిష్యత్ రాజస్థాన్ చేతిలో ఉంది. రాజస్థాన్ ఓ మ్యాచ్ ఓడాలని, తాము భారీ తేడాతో గెలవాలని కోరుకుంటున్నాయి. పంజాబ్ కింగ్స్ (13), రాజస్థాన్ రాయల్స్ (12), ఢిల్లీ క్యాపిటల్స్ (12), చెన్నై సూపర్ కింగ్స్ (12) కోల్‌కతా నైట్‌రైడర్స్ (11) పాయింట్లతో ఉన్నాయి. చివరి బెర్త్ దక్కించుకునే ఆ లక్కీ టీమ్ ఎదో చూడాలి.
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!