MS Dhoni Return: వాంఖడేలో హై వోల్టేజ్ పోరు.. సీఎస్‌కేకు గుడ్ న్యూస్, దిగ్గజం దిగుతున్నాడు!
- గురువారం వాంఖడేలో హై వోల్టేజ్ పోరు
- గెలుపే లక్ష్యంగా బరిలోకి ఎంఐ, సీఎస్‌కే
- సీఎస్‌కేకు గుడ్ న్యూస్, దిగ్గజం దిగుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Likely Return for MI vs CSK Clash in IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడేలో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్దమైంది. గురువారం ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు టీమ్స్ దిగువన ఉండడంతో.. ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గెలిచిన టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఓడిన జట్టుకు మాత్రం ఆశలు సన్నగిల్లుతాయి. ఈ నేపథ్యంలో ఎంఐ, సీఎస్‌కేలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ముంబైతో కీలక పోరుకు ముందు చెన్నైకి ఓ గుడ్ న్యూస్. మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
మోకాలి గాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోనీ జట్టుతో పాటే ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం భాగ్యనగరం కూడా వచ్చాడు. ఉప్పల్ స్టేడియంలో ఆడుతాడనుకున్నా.. అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో మహీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. సుమారు అరగంట పాటు వికెట్ కీపింగ్ చేశాడు. మరో అరగంట పాటు బ్యాటింగ్ కూడా చేశాడు. ప్రీ సీజన్‌లో కాల్ఫ్ స్ట్రెయిన్‌తో ఇబ్బంది పడిన ధోనీ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బంతులను సులభంగా బౌండరీకి పంపడం అభిమానులకు ఊరటనిచ్చింది. ముంబైపై ధోనీ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. మహీ ఆడడంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండటంతో.. ధోనీ రీఎంట్రీ జట్టుకు భారీ బలాన్నిస్తుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సీఎస్‌కే జట్టులోకి ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ చేరాడు. గాయపడిన నాథన్ ఎల్లిస్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు వాంఖడేలో జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఇటీవల గాయంతో ఖలీల్ అహ్మద్ కూడా దూరమవడంతో.. జాన్సన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సీఎస్‌కేకు గాయాల సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇటీవల మ్యాచ్‌లో యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే హామ్‌స్ట్రింగ్ గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో జట్టులో మార్పులు తప్పనిసరి అయ్యాయి.
ముంబై ఇండియన్స్‌కు కూడా ఓ గుడ్ న్యూస్. ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్ ఎట్టకేలకు జట్టుతో చేరాడు. ఐపీఎల్ 2026 ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన జాక్స్.. తాజాగా వాంఖడేలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ.. గంటకు పైగా బ్యాటింగ్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను చూపించాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జాక్స్.. ముంబై జట్టుకు కీలక బలం కానున్నాడు. అతడి చేరికతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు మరింత బలపడనున్నాయి. జాక్స్ జట్టులోకి రావడంతో విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌లో మార్పులు రావొచ్చు. అల్లా ఘజన్‌ఫర్ లేదా మిచెల్ సాంట్నర్‌లో ఒకరు చోటు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో జాక్స్ ఫినిషర్‌గా కూడా కీలక పాత్ర పోషించగలడు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!