Sunrisers Hyderabad: మైల్‌స్టోన్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి.. అదే కొంపముంచిందన్న ఇషాన్ కిషన్!
- ఎస్‌ఆర్‌హెచ్ మరో అరుదైన మైలురాయి
- మైల్‌స్టోన్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమి
- అదే కొంపముంచిందన్న ఇషాన్ కిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో అరుదైన మైలురాయిని అందుకుంది. నేడు ఎస్‌ఆర్‌హెచ్ తన 200వ మ్యాచ్‌ను ఆడింది. 2013లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సన్‌రైజర్స్.. తక్కువ సమయంలోనే మెగా లీగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే మైల్‌స్టోన్ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని ఎదుర్కొంది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఎస్‌ఆర్‌హెచ్ 219 రన్స్ చేయగా.. లక్షాన్ని పీబీకేఎస్ 18.5 ఓవర్లలోనే ఊదిపడేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని చెప్పాడు. ‘మాకు అద్భుతమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు 6 ఓవర్లలోనే 100 రన్స్ చేశారు. అదే మూమెంట్ కొనసాగిస్తే 240-250 పరుగులు చేయగలిగేవాళ్లం. కానీ మధ్యలో కొన్ని తప్పిదాలు జరిగాయి. అయినప్పటికీ 219 మంచి టోటల్. మా జట్టులో ఆరు నుంచి ఏడు మంది మంచి బౌలర్లు ఉన్నారు కాబట్టి ఈ స్కోర్‌ను కాపాడగలమని అనుకున్నాం. టీ20 క్రికెట్‌లో ముఖ్యమైనది మంచి బంతులను సరైన ప్రదేశాల్లో వేయడం. కానీ ఈరోజు మేము ఆ విషయంలో విఫలమయ్యాం. ప్లాన్‌లు సరిగ్గా అమలు చేయలేకపోయాం. అదే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు సులభంగా పరుగులు చేయడానికి కారణమైంది’ అని ఇషాన్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కెప్టెన్‌గా బౌలర్లతో చర్చలపై కూడా ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ రోజుల్లో ప్లాన్స్ ఎక్కువగా మ్యాచ్‌కు ముందే చేస్తాం. ప్రతి బ్యాటర్ ఎలా ఆడతాడో తెలుసుకుంటాం. కానీ మ్యాచ్‌లో ముఖ్యమైంది ఎగ్జిక్యూషన్. మీరు సరైన లెంగ్త్, లైన్‌లో బౌలింగ్ చేయకపోతే ప్రతి ఓవర్‌లో 10-20 పరుగులు ఇవ్వాల్సి వస్తుంది. 200+ స్కోర్లు సేఫ్ కాదా అన్నది ఎక్కువగా ఆలోచించం. బ్యాటింగ్ చేస్తే పరుగులు చేయాలి, బౌలింగ్ చేస్తే రన్స్ కాపాడాలి. కానీ సరైన ప్రణాళిక, అమలు లేకపోతే ఎంత స్కోర్ చేసినా ఉపయోగం ఉండదు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!