Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
- ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం
- పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్
- ఆశ్చర్యానికి గురవుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో మరో చారిత్రాత్మక ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ‘ఆరెంజ్ క్యాప్’ (టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు) ఓ ఆటగాడి వద్ద ఎక్కువ సమయం ఉండటం మనం చూస్తుంటాం. కనీసం ఓ రోజైనా ప్లేయర్ వద్ద ఉంటుంది. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం ఒకే రోజులో నలుగురు ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఇది ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జరగడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగగా.. రాత్రి రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌లలో స్టార్ పరుగుల వరద పారించడంతో ఆరెంజ్ క్యాప్ చేతులు మారింది. ఉదయం సమయంలో విరాట్ కోహ్లీ వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది.మధ్యాహ్నానికి వచ్చేసరికి కేఎల్ రాహుల్ (152) భారీ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
సాయంత్రం మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీతో (103) అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో ఆరెంజ్ క్యాప్ మళ్లీ చేతులు మారింది. కేఎల్ రాహుల్ నుంచి వైభవ్ అందుకున్నాడు. ఇక అభిషేక్ శర్మ (57) తన అద్భుత ప్రదర్శనతో మరోసారి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. వైభవ్ నుంచి అభిషేక్ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. ఒకే రోజులో ఇలా నాలుగు సార్లు ఆరెంజ్ క్యాప్ మారడం ఐపీఎల్ చరిత్రలో అరుదైన సంఘటనగా మారింది. ఇది ఈ సీజన్లో బ్యాట్స్‌మెన్ మధ్య ఉన్న తీవ్రమైన పోటీని స్పష్టంగా చూపిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో పరుగుల వర్షం కురుస్తుండటంతో.. ఆరెంజ్ క్యాప్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!