IPL 2026 Flops: వేలంలో మతిపోగోట్టే ధరలు, మైదానంలో మాత్రం విఫలం.. నిరాశపర్చిన స్టార్ ఆటగాళ్లు వీరే!
- ఐపీఎల్ 2026 వేలంలో మతిపోగోట్టే ధరలు
- మైదానంలో ఫలితం మాత్రం శూన్యం
- 2026లో నిరాశపరిచిన స్టార్ ఆటగాళ్లు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించాయి. టీమిండియా కీపర్ రిషభ్ పంత్, వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌పై ప్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించాయి. వీరందరూ ఐపీఎల్ 2026లో అంచనాలను అందుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయలు పలికిన ఈ ఆటగాళ్లు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. వారి ఫామ్ జట్టుల ఫలితాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ సీజన్లో అత్యంత నిరాశపరిచిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
లక్నో సూపర్ జెయింట్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను రూ.27 కోట్ల భారీ మొత్తంతో రిటైన్ చేసుకుంది. అయితే ఈ సీజన్లో పంత్ ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. గత సీజన్ లానే ఈసారి కూడా అతను పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కీలక సమయంలో జట్టును నిలబెట్టే ఇన్నింగ్స్‌లు పంత్ ఆడడం లేదు. లక్నోకు చెందిన మరో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను రూ.21 కోట్లకు రిటైన్ చేశారు. అతని ప్రదర్శన కూడా తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన పూరన్.. ఈ సీజన్లో పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో అతని బ్యాట్ మూగబోయింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.2 కోట్లకు కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని నుంచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన రావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఆ స్థాయిలో ఆడలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అతని ప్రభావం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ రూ.14.2 కోట్ల భారీ ధరకు తీసుకున్న కార్తిక్ శర్మ పరిస్థితి మరింత విచిత్రం అనే చెప్పాలి. ప్రారంభ మ్యాచ్‌లలో నిరాశపరిచిన తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇంత పెద్ద మొత్తానికి కొనుగోలు చేసిన ఆటగాడు బెంచ్‌కే పరిమితం కావడం సీఎస్కేకు మైనస్‌గా మారింది.
రూ.14.2 కోట్ల ధరకు సీఎస్కే జట్టులోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక మ్యాచ్‌లో మోస్తరు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. జట్టుకు ఉపయోగపడేలా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతని ప్రదర్శన కూడా జట్టుకు నిరాశ కలిగించింది. మొత్తంగా చూస్తే ఐపీఎల్ 2026లో భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన ఈ స్టార్ ఆటగాళ్లు ఇప్పటివరకు అంచనాలను అందుకోలేకపోయారు. సీజన్ మిగతా భాగంలో అయినా వారు ఫామ్‌లోకి వచ్చి తమ జట్టులకు కీలకంగా మారతారా? లేక ఇలాగే నిరాశపరుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..