IPL 2024 Playoffs Scenario: ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరం.. రెండు స్థానాలకు నాలుగు జట్ల మధ్య పోటీ! ఆర్సీబీకి కష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 Playoffs Chances: ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. మార్చి 22 ఆరంభం అయిన ఈ టోర్నీ.. నెల రోజులకు పైగా క్రికెట్ ఆభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ టీమ్స్ ఏవి, ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్స్ ఖాతాలో ఉన్న సన్‌రైజర్స్.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్‌లలో ఒకటి గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళుతుంది. సన్‌రైజర్స్ ఫామ్ చూస్తే.. ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్స్ ఉన్న చెన్నై.. నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన 3 మ్యాచ్‌లలో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళుతుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, లక్నోలు 12 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లలో ఓడితే.. ఢిల్లీ, లక్నోకు చాన్స్ ఉండదు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి అవకాశం దాదాపు లేదు. ప్రస్తుతం రన్ రేటే -0.09, ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మిగతా మూడు మ్యాచ్‌లను కచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. అంతేకాదు చెన్నై, లక్నో, ఢిల్లీ టీమ్స్ తర్వాతి మ్యాచ్‌లలో ఓడిపోతేనే బెంగళూరు అవకాశం ఉంటుంది. ఇదంతా జరిగే పని కాదనే చెప్పాలి.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!