MS Dhoni-Fan: నీ బాధ్యత నాది.. నీకేమీ కానివ్వను! అభిమానికి ఎంఎస్ ధోనీ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fan Reveals MS Dhoni’s Promise: ఐపీఎల్ 2024లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మధ్యలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఉండగా.. ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చి మహీ పాదాలను తాకాడు. అనంతరం ధోనీ అతడిని హత్తుకుని.. మాట్లాడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ అభిమానితో ధోనీ ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియలేదు. తాజాగా మహీ తనతో ఏం మాట్లాడాడో సదరు అభిమాని స్వయంగా చెప్పాడు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోనీ అభిమాని మాట్లాడుతూ… ‘నా పేరు జై జానీ. ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానిని. మహీ ఒక లెజెండ్. చెన్నై, గుజరాత్ మ్యాచ్ జరుగుతుండగా ధోనీ మైదానంలోకి వచ్చారు. ఏది ఏమైనా అతడిని కలవాలనిపించింది. అందుకే ఫెన్సింగ్ దూకి మైదానంలోని ధోనీ దగ్గరకు పరిగెత్తా. మహీ భాయ్ పరిగెత్తగానే వెళ్లిపోతాడేమో అనుకున్నాను. చేయి పైకెత్తి గట్టిగా సార్ అని అరిచాను. అప్పుడు నేను సరదాగా పరిగెత్తాను అని నాతో అన్నారు. ఆయన పాదాలను తాకా. ధోనీని చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని తెలిపాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Also Read: Riyan Parag: అహంకారం ఏమీ లేదు.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!
‘మాట్లాడుతుండగా నాకున్న సమస్యను ఎంఎస్ ధోనీ పసిగట్టారు. ఎందుకు అంత వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నావ్ అని అడిగారు. నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పా. ‘నువ్వేమీ భయపడకు. నీకు నేనున్నా. నీ సర్జరీ బాధ్యత నాది. నీకేమీ కానివ్వను’ అని మహీ భాయ్ ధైర్యం ఇచ్చారు. ఇతడిని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లండి. ఏమీ అనొద్దు అని సిబ్బందికి చెప్పారు. మైదానంలో దాదాపు 21 సెకన్ల పాటు ధోనీతో మాట్లాడా. ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను’ అని జై జానీ చెప్పాడు. జై జానీ మహీ గురించి చెప్పైనా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ మంచి మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
The fan who invaded the pitch to meet MS Dhoni had breathing issues.
MS when the fan tells him this – “I will take care of your surgery. Nothing will happen to you, don’t worry. I won’t let anything happen to you”. ❤️pic.twitter.com/9uMwMktBxZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2024
- Tags
- CSK
- fan
- IPL 2024
- ms dhoni
- MS Dhoni Fan
తాజావార్తలు
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!