Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!
- 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 పరుగులు
- జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు
- ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఆటతోనే కాకుండా భావోద్వేగ క్షణాలతో కూడా నిండిపోయింది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 పరుగులు చేశాడు. 15 ఏళ్ల యువ సంచలనం ప్రపంచ టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఇక మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆప్యాయంగా పలకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటమి బాధను పక్కన పెట్టి.. వైభవ్ ప్రదర్శనను అభినందించాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా.. గుండెపై చేయి వేసి బాగా ఆడావ్ అని మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ పాండ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓడిపోయిన జట్టు కెప్టెన్‌గా ఉండి కూడా ప్రత్యర్థి యువ ఆటగాడిని ప్రశంసించడం ద్వారా హార్దిక్ తన స్పోర్ట్స్‌మన్‌షిప్‌ను చాటుకున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో నిజమైన విజేతగా హార్దిక్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ‘వైభవ్ సూర్యవంశీ బాగా ఆడాడు. ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యంగా ఆడటం అద్భుతం. అతని ఆట, షాట్స్, బెరుకు లేమి చూసి నేను ఆశ్చర్యపోయాను. మ్యాచ్‌కు ముందు కూడా వైభవ్ గురించి చాలా చర్చించాం. ఎలా ఆడుతున్నాడు, ఎందులో బలహీనంగా ఉన్నాడు అని మాట్లాడుకున్నాం. ఒకటి మాత్రం చెప్పాలి.. వైభవ్ షాట్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. భవిష్యత్తులో అతను ఇంకా గొప్పగా రాణించాలని కోరుకుంటున్నాను’ అంటూ ప్రశంసలు కురిపించాడు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!