Lucknow firing: ఇరువర్గాల ఘర్షణ.. తుపాకీతో కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చిన్నపాటి డ్యాషింగ్.. ఇరువర్గాల మధ్య ఘర్షణ కాల్పులకు దారి తీసింది. ఇరువైపులా పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకున్నారు. అనంతరం ఒక వ్యక్తి తుఫాకీతో కాల్పులకు తెగబడ్డాడు. లక్నోలోని ఈశ్వరీ ఖేరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Taneti Vanitha: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్.. టీడీపీ హింసాకాండ మీద చర్యలకు డిమాండ్
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ఐదేళ్ల సోదరుడిని స్కూల్ దగ్గర రిసీవ్ చేసుకుని.. ఇద్దరూ ఇంటికి తిరిగి వెళ్తుండగా.. దారిలో వారి స్కూటర్‌ను ఒక కారు ఢీకొట్టింది. అనంతరం కారు యజమాని హర్ష్ ఉపాధ్యాయ్, అతని స్నేహితులు ఇద్దరు సోదరులను కొట్టారు. సోదరులిద్దరూ కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. పెద్ద గుంపుగా వచ్చి కారు యజమాని కుటుంబ సభ్యులపై రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దాదాపు ఇరువర్గాల నుంచి 40-50 మంది పాల్గొన్నారు. చిన్నగా మొదలైన గొడవ ఇరువైపులా రాళ్లు రువ్వుకున్నారు. సూట్‌లో ఉన్న ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెరలేపాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హింసాత్మక ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంగళవారం లక్నోలోని ఈశ్వరీ ఖేరా ప్రాంతంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా ఆస్తులు ఇవే!
ఈ ఘర్షణపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. తుపాకీతో కాల్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Varanasi: మోడీపై నామినేషన్ వేయనివ్వలేదన్న కమెడియన్ శ్యామ్ రంగీలా
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!