42 ఏళ్ల వయస్సులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాడు. ఈ వయసులోనూ కూడా కుర్రాడిలా ఆడేస్తున్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేస్తూ మ్యాచ్‌లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ ఎడిషన్ మహీకి చివరిది అని అస్సలు కనిపించడం లేదు. ధోనీ ఎనర్జీ, సక్సెస్‌కు కారణం ఏంటో? తెలిసిపోయింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతున్న తరుణంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను షేర్ చేసింది. గతంలో ధోనీ మాట్లాడిన వీడియో ఇప్పుడు మరోసారి చెక్కర్లు కొడుతోంది.
వీడియోలో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘చాలా మందికి ఇది అసంబద్ధమైన టైమ్-టేబుల్. కానీ సంవత్సరాలుగా అదే నాకు సాయం చేస్తోంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి 5-7 రోజుల ముందు నుంచే నేను మానసికంగా సిద్ధమవుతా. ఒక్కోసారి రాత్రి 12 తర్వాత మేం ఫ్లైట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రతిసారి నేను ఆలస్యంగా నిద్ర పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆపై కిట్ బ్యాగ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఆలస్యంగా డిన్నర్ చేయాలి. దీంతో హోటల్ గదికి చేరుకునే సరికి 1.15 అవుతుంది’ అని అన్నాడు.
Also Read: Tim Seifert Batting: బంతిని బాదేందుకు భారీ డైవ్ చేసిన బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వులే!
‘హోటల్ వెళ్లాక మా వస్తువులను ప్యాక్ చేసుకోవాలి. అప్పుడు 2.30 దాటుతుంది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటలకు పడుకొని ఉదయం 6 గంటల వరకు లేదా రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు నిద్రపోతాను. మ్యాచ్ సమయంలో మాత్రం 3 గంటలకు పడుకొని ఉదయం 11 గంటలకు లేస్తా. 8 గంటలు నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటా. రాత్రి బాగా విశ్రాంతి తీసుకుంటా. కాబట్టి ఐపీఎల్ ముగిసినా నాకు పెద్దగా అలసట అనిపించదు’ అని ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు. ఈ ఎడిషన్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 91 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరలో వచ్చి సిక్సులు, ఫోర్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు.
In an exclusive talk, @msdhoni unveils the secret to less fatigue and staying fresh for him and the team! 💛
Follow this #IncredibleIcon play against @SunRisers in #IPLOnStar! 🙌
📺 | #CSKvSRH | TODAY, 6:30 PM | #IPLOnStar pic.twitter.com/emH5bfuseb
— Star Sports (@StarSportsIndia) April 28, 2024