Chennai Super Kings : చెన్నైకి అసలు విలన్ అతడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు ఆల్మోస్ట్ ముగిశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక పోరులో చెన్నై మరోసారి తడబడింది. ఆరంభంలో రాణించిన బ్యాటర్లు. కీలక దశలో పరుగులు చేయలేకపోయారు. దీంతో చెన్నై 154 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో సిఎస్కె ప్లేఆప్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇంకా చెన్నై మరో ఐదు మ్యాచులు ఆడాల్సి ఉంది.ఈ ఐదింటిలో గెలిచి, ఆపై మిగతా జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఎటు చూసినా చెన్నైకి దారులు మూసుకుపోయాయి. దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయిన మొదటి జట్టుగా చెన్నై నిలిచింది. వాస్తవానికి ఈ సీజన్ ఆరంభం నుంచే చెన్నై పేలవ ఫామ్ కొనసాగుతుంది. వరుస మ్యాచుల్లో తమ బలాన్ని తగ్గించుకుంటూ వెళ్ళింది. అయితే ధోనీ చెన్నై తలరాతను మారుస్తాడనుకున్న వారందరికీ నిరాశే మిగిల్చాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా సక్సెస్ కాలేదు. గత 4 మ్యాచ్‌లలో ధోని బ్యాట్ నుండి కేవలం 6 బౌండరీలు మాత్రమే వచ్చాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులు , తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఒక ఫోర్‌తో సహాయంతో 6 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ల గురించి మాట్లాడుకుంటే ఎంఎస్ ధోని పేరు అగ్రస్థానంలో ఉంటుంది. అతని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 5 ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. 2023 ఐపీఎల్ తర్వాత ధోని… కెప్టెన్సీ బాధ్యతలని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. అయితే ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోగా చెన్నై యాజమాన్యం జట్టు బాధ్యతల్ని ధోనికి అప్పగించింది. కానీ ధోనీ మాయాజాలం పనిచేయలేదు. ధోనీ వచ్చిన మొదటి మ్యాచ్ లో చెన్నైని గెలిపించినప్పటికీ, ఆ తర్వాత వరుస ఓటములతో ప్లేఆప్స్ అవకాశాలను కోల్పోయింది. దీంతో ధోనీ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైకి అసలు విలన్ నువ్వేనంటూ ట్విట్టర్ లో వార్ నడుస్తుంది. కొందరు ధోనీని విమర్శిస్తుంటే, ధోనీ ఫాలోవర్స్ మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Tags
తాజావార్తలు
-
Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
-
YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
-
Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!