Site icon NTV Telugu

RCB Stampede: సీఎం, డిప్యూటీ సీఎం హాగ్స్, ఫోటోల్లో బిజీగా ఉన్నారు.. తొక్కిసలాటను పట్టించుకోలేదు..

Bjp

Bjp

RCB Stampede: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడంతో.. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలు చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. దీంతో గ్రౌండ్ గేట్ల వద్ద జరిగిన విషాదకరమైన తొక్కిసలాట ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, పరిపాలనా వైఫల్యానికి కారణమైందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. అమాయకమైన 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: RCB Stampede: ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాదం.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న విజువల్స్

అయితే, బెంగళూరులో జరిగిన తొక్కిసలాట.. ఒక పీడకలగా మారింది అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియా పేర్కొన్నారు. ఒక వైపు, తొక్కిసలాట జరిగిన అభిమానులు తీవ్ర నిరాశలో ఉంటే.. వేదికపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మాత్రం క్రికెటర్లతో కౌగిలింతలు, ఫోటోలు తీసుకోవడంతో చాలా బిజీగా ఉన్నారని ఆరోపించారు. జన సమూహాన్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని అమిత్ మాల్వియా అన్నారు.

Exit mobile version