Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్‌ఫ్రెండ్‌పై కాదు.. బౌలింగ్‌పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
- స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న అర్ష్‌దీప్
- భారీగా పరుగులు ఇస్తున్న అర్ష్‌దీప్
- అర్ష్‌దీప్‌ను ఆటాడుకుంటున్న నెటిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netizens Trolls Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న అర్ష్‌దీప్.. ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. గత సీజన్లలో పీబీకేఎస్‌కు కీలక బౌలర్‌గా సేవలందించిన అతడు.. ఈసారి మాత్రం భారీగా పరుగులు ఇస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ గణాంకాలు చూస్తే అతని ఫామ్ ఎంతలా పడిపోయిందో ఇట్టే తెలుస్తోంది.
అర్ష్‌దీప్ సింగ్ తాజాగా రాజస్థాన్‌పై 4 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు ఢిల్లీపై 49 పరుగులు, లక్నోపై 41 పరుగులు సమర్పించుకున్నాడు. హైదరాబాద్‌పై 50 పరుగులు, చెన్నైపై 41 పరుగులు, ముంబైపై 42 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లలో కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఓవరుకు సగటు 11 ఎకానమీ రేట్ నమోదు చేశాడు. అదనంగా 16 వైడ్లు వేయడం అతని బౌలింగ్ నియంత్రణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెటిజెన్స్ కూడా వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ అతడిని ట్రోల్స్ చేస్తున్నారు. రీల్స్, గర్ల్‌ఫ్రెండ్‌పై దృష్టి పెట్టడం మానేసి.. బౌలింగ్‌పై దృష్టి పెట్టు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ 2026లో అర్ష్‌దీప్ సింగ్ గణాంకాలు చూస్తే.. సింగ్ సాబ్ తన లైన్, లెంగ్త్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులు అదుపు చేయడంలో విఫలమవడం జట్టుకు భారంగా మారుతోంది. టీ20 ఫార్మాట్‌లో బౌలర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉండటం సహజమే అయినప్పటికీ.. నిలకడ చాలా ముఖ్యం. ప్రతి ఆటగాడికి ఫామ్‌లో ఎత్తుపల్లాలు సహజం. సరైన ప్రాక్టీస్, ఫోకస్‌తో అర్ష్‌దీప్ మళ్లీ తన బెస్ట్ ఫామ్‌కు చేరుకుంటాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!