Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లోని 38వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ అంగ్క్రిష్ రఘువంశీని అరుదైన వివాదాస్పద రీతిలో ఔట్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ‘ఫీల్డ్‌కు ఆటంకం కలిగించినందుకు’ (Obstructing the Field) అంగ్క్రిష్ రఘువంశీని ఔట్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఈ నిర్ణయం LSG కెప్టెన్ రిషభ్ పంత్ క్రీడాస్ఫూర్తిపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది.
అసలు ఘటన ఏమిటి?
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మ్యాచ్‌లో KKR ఇన్నింగ్స్‌లో 5వ ఓవర్ చివరి బంతికి ఈ సంఘటన జరిగింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ చేసిన బంతిని అంగ్క్రిష్ రఘువంశీ మిడ్-ఆన్ వైపు నుజ్ చేశాడు. సింగిల్ తీసుకోవాలని ముందుకు వెళ్లాడు. కానీ నాన్-స్ట్రైకర్ కామెరాన్ గ్రీన్ అతన్ని వెనక్కి పంపాడు. వెనక్కి తిరిగి క్రీజ్‌లోకి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ అంగ్క్రిష్ తన రన్నింగ్ లైన్‌ను కొంత మార్చుకున్నాడు. ఆ సమయంలో మహమ్మద్ షమీ విసిరిన థ్రో అతని శరీరానికి (కాళ్లకు) తగిలింది. దీంతో LSG ఆటగాళ్లు ముఖ్యంగా షమీ కెప్టెన్ రిషభ్ పంత్ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కోసం అప్పీల్ చేశారు.
ఆన్-ఫీల్డ్ అంపైర్ దీన్ని థర్డ్ అంపైర్‌కు పంపాడు. రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీ ఉద్దేశపూర్వకంగా తన దారి మార్చి ఫీల్డర్ థ్రోకు అడ్డుపడ్డాడని తీర్పు ఇచ్చాడు. అంగ్క్రిష్ రఘువంశీ 9(8) బాల్స్‌లో 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ డిస్మిసల్తో KKR పవర్‌ప్లేలోనే ఇబ్బందికి గురైంది.
KKR క్యాంప్ రియాక్షన్
ఔట్ అయిన తర్వాత అంగ్క్రిష్ రఘువంశీ తన బ్యాట్, హెల్మెట్‌ను నేలకు కొట్టి తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. KKR హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ ఫోర్త్ అంపైర్‌తో చాలా సేపు వాగ్వాదం చేశారు. సహాయక కోచ్ షేన్ వాట్సన్ కూడా స్పష్టంగా అసంతృప్తి చెందినట్లు కనిపించారు.
‘ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ నియమం అంటే ఏమిటి?
క్రికెట్ నియమాల ప్రకారం, బ్యాట్స్‌మన్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ సైడ్‌ను మాటలతో గానీ, చేతలతో గానీ అడ్డుకుంటే లేదా డిస్ట్రాక్ట్ చేస్తే అతన్ని Obstructing the Fieldగా ఔట్ చేయవచ్చు. ఇది MCC లా 37లో పేర్కొన్నారు. ఈ ఘటనలో అంగ్క్రిష్ రఘువంశీ తన రన్నింగ్ లైన్ మార్చడం వల్ల థ్రోకు అడ్డుపడ్డాడని అంపైర్లు భావించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకమా లేదా అక్సిడెంటల్ గా జరిగిందా అనేది వివాదాస్పదంగా మారింది.
ఐపీఎల్ చరిత్రలో ఈ రకమైన డిస్మిసల్స్ (4వ సారి)
యూసుఫ్ పఠాన్ – 72(44) vs PWI, రాంచీ, 2013
అమిత్ మిశ్రా – 1(2) vs SRH, వైజాగ్, 2019
రవీంద్ర జడేజా – 5(6) vs RR, చెన్నై, 2024
అంగ్క్రిష్ రఘువంశీ – 9(8) vs LSG, లక్నో, 2026
𝐖𝐇𝐀𝐓 𝐉𝐔𝐒𝐓 𝐇𝐀𝐏𝐏𝐄𝐍𝐄𝐃?! 😳
Mix-up. Long turn. Third umpire drama… & Raghuvanshi is given OUT for obstructing the field! 👀
Just the 4️⃣th instance of a batter being given out for obstructing the field in TATA IPL 🤯#TATAIPL 2026 ➡️ #LSGvKKR | LIVE NOW… pic.twitter.com/WRgr608Odb
— Star Sports (@StarSportsIndia) April 26, 2026
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!