Ajinkya Rahane: నేను క్రికెట్ ఆడటం వారికి నచ్చడం లేదు.. రహానే సంచలన వ్యాఖ్యలు!
- కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో ఓటమి
- 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసిన రహానే
- నేను క్రికెట్ ఆడటం వారికి నచ్చడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajinkya Rahane Hits Back at Critics Over Strike Rate: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో ఓటమి ఎదురైంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన కేకేఆర్.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) చేతిలో ఓటమిని చవిచూసింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యంను ఛేదించే క్రమంలో కేకేఆర్ తడబడింది. నిర్ణీత ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయి వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో కేకేఆర్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ అజింక్య రహానే.. 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. కీలకమైన సమయంలో నెమ్మదిగా ఆడి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో.. రహానే స్ట్రైక్‌రేట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆధునిక టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లుగా రహానే ఆడలేకపోతున్నారనే వాదనలు వినిపించాయి. వాటిపై రహానే ఘాటుగా స్పందించాడు. తన సక్సెస్ చూడలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డాడు. తాను క్రికెట్ ఆడటం కొందరికి నచ్చడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జింక్స్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘నా స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేసేవారికి అసలు క్రికెట్ గురించి తెలుసో లేదో అర్థం కావడం లేదు. బహుశా వారు సరిగ్గా మ్యాచ్‌లు చూడటం లేదేమో. లేదా నాపై ఏదైనా ప్రత్యేక అజెండాతో ఉన్నారేమో అనిపిస్తోంది. నా సక్సెస్ చూసి కొందరు అసూయ పడుతున్నారు. అందుకే నా ఆటను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కేవలం ఒక్క ఇన్నింగ్స్ ఫెయిల్యూర్‌ను బట్టి నా ఉద్దేశాలను తప్పుబట్టడం సరికాదు. నేను క్రికెట్ ఆడటం, విజయం సాధించడం వారికి నచ్చడం లేదు. బయట నా గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా సరే.. నాపై చర్చ జరుగుతున్నందుకు నేను సంతోషంగానే ఉన్నాను. వారిని ఏదైనా మాట్లాడుకోనివ్వండి’ అని రహానే ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!