IPL: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇకపై 94!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ లీగ్ ప్రారంభం అవుతోందంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే పండగలాంటి వాతావరణం నెలకొంటుంది. ఇంత క్రేజ్ ఉండటం వల్లే.. ఈ లీగ్‌ను మరింత పొడిగించాలని నిర్ణయించారు. అవును, ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. రానున్న సీజన్ల నుంచి ఐపీఎల్‌ను రెండున్నర నెలలకు పెంచబోతున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. అంటే.. వరుసగా 10 వారాలపాటు ఈ లీగ్ సాగనుందన్నమాట! ఇందుకు ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జై షా పేర్కొన్నాడు.
అయితే.. కొత్త ఫ్రాంచైజీలను ఇప్పట్లో తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని కుండబద్దలు కొట్టిన జై షా, ఉన్న జట్లతోనే మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు చెప్పాడు. అంతేకాదు.. ఆటగాళ్ల సంఖ్యను కూడా మరింత పెంచాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. 2024-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌పై చర్చలు జరిపేందుకు వచ్చే వారం ఐసీసీ సమావేశం కానుందని, ఇందులో ఐపీఎల్ విండోపై పూర్తి క్లారిటీ వస్తుందని అన్నాడు. కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరిగిన విషయం తెలిసిందే. దీంతో, మ్యాచ్‌ల సంఖ్య 74 పెరగడంతో ఈ లీగ్ రెండు నెలలపాటు సాగింది. రానున్న సీజన్‌లలో మ్యాచ్‌ల సంఖ్య 94కు పెరిగే అవకాశముంది.
Also Read
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
- Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
- KL Rahul: సహచర ఆటగాళ్లను తిట్టిన కేఎల్ రాహుల్.. అసలు నిజం చెప్పేసిన మాజీ కోచ్!
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!