Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ipl Auction 2026 Cameron Green Becomes Most Expensive Overseas Player Kkr Bags Him For Rs 25 20 Cr

Cameron Green IPL Price: కామెరూన్‌ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!

Published Date :December 16, 2025 , 3:32 pm
By Sampath Kumar
  • కామెరూన్‌ గ్రీన్‌కు జాక్‌పాట్
  • రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
  • అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ రికార్డు
Cameron Green IPL Price: కామెరూన్‌ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అందరూ ఊహించిందే నిజమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు జాక్‌పాట్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ.25.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ రికార్డు నెలకొల్పాడు. గ్రీన్‌ బేస్‌ ప్రైస్‌ రూ.2 కోట్లు కాగా.. అతడి కోసం కేకేఆర్ సహా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.

సెట్‌ 1 బ్యాటర్లలో కామెరూన్‌ గ్రీన్‌ వేలానికి రాగా.. ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. ముంబైతో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడింది. రూ.2.80 కోట్ల వద్ద కోల్‌కతా నైట్ రైడర్స్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో ముంబై వేలం నుంచి తప్పుకుంది. గ్రీన్‌ కోసం రాజస్థాన్, కోల్‌కతాలు పోటీపడ్డాయి. రూ.13.60 కోట్ల వద్ద రాజస్థాన్ వెనక్కి తగ్గగా.. చెన్నై సూపర్ కింగ్స్ రేసులోకి వచ్చింది. చెన్నై, కోల్‌కతాలు నువ్వా నేనా అన్నట్లు గ్రీన్‌ కోసం పోటీపడ్డాయి. దాంతో గ్రీన్‌ ధర రూ.25.20కి పెరిగింది. చివరకు చెన్నై తప్పుకోవడంతో గ్రీన్‌ కోల్‌కతాకు సొంతమయ్యాడు.

Also Read: Prithvi Shaw Unsold: పాపం పృథ్వీ షా.. ఈసారి కూడా ఎవరూ దేకలే!

ఐపీఎల్ 2026లో ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కేకేఆర్ తరఫున ఆడనున్నాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ చరిత్ర సృష్టించాడు. అంతకుందు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ అత్యధిక ధర పలికిన విషయం తెలిసిందే. 2024లో స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. 2024 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు కమ్మిన్స్ను కొనుగోలు చేసింది. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. రిషభ్‌ పంత్ (రూ.27 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) గ్రీన్ కంటే ముందున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cameron Green
  • Cameron Green IPL Price
  • Cameron Green KKR
  • IPL 2026
  • IPL 2026 mini auction

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions