IPL 2027-MI: ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. కెప్టెన్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma Set for MI Vice-Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ కొత్త కెప్టెన్‌ను ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. రోహిత్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించేందుకు ముంబై మేనేజ్మెంట్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ?
యువ ఆటగాడు, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జట్టులో భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేసే దిశగా.. ముంబై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనుందట. అయితే దీనిపై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 39 ఏళ్ల రోహిత్ శర్మ మరో 3-4 ఏళ్లు జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా తిలక్ వర్మను తదుపరి కెప్టెన్‌గా సిద్ధం చేయాలని ఎంఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read
- IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
- Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
- Prithvi Shaw: నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. పృథ్వీ షా వార్నింగ్!
- Shubman Gill: శుభ్‌మన్ గిల్.. నువ్వు ఓ కెప్టెన్! మైదానంలోనే అలా చేయడం సరికాదు!
కెప్టెన్సీ రేసులో సూర్య, బుమ్రా లేనట్టే:
మరోవైపు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు కెప్టెన్సీ రేసులో లేవని తెలుస్తోంది. సూర్యకుమార్ ఆటగాడిగా ముంబై ఇండియన్స్ జట్టుతోనే కొనసాగనున్నాడు. బుమ్రా విషయంలో అతడి పనిభారాన్ని నిర్వహించాల్సిన అవసరం కెప్టెన్సీ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ బుమ్రా బౌలింగ్ భారాన్ని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
మళ్లీ రోహిత్ శకమేనా?:
రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ గతంలో ఎన్నో విజయాలు అందుకుంది. అతడి సారథ్యంలో ఏకంగా ఐదు టైటిల్స్ (2013, 2015, 2017, 2019, 2020) గెలిచింది. అందుకే అతడిని తిరిగి కెప్టెన్‌గా నియమించనున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ముంబై యాజమాన్యం చేసే ప్రకటనతోనే ఈ ఊహాగానాలకు స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
IPL 2027-MI: ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. కెప్టెన్ ఎవరంటే?
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి శోభ.. వేములవాడ నుంచి శ్రీశైలం వరకు భక్తుల సందడి
-
IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
ట్రెండింగ్
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!