IPL 2026 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ RCB vs SRH!
- మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం
- తొలి మ్యాచ్‌లోనే RCB vs SRH హై వోల్టేజ్ పోరు
- హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే
- ముంబై, చెన్నై, గువహటి వేదికగా కీలక మ్యాచ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Schedule Released : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సందడికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఈ మెగా టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం కీలక ప్రకటన చేసింది. టోర్నీలో భాగంగా మొదటి దశ (Phase-1) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్లో తొలి పోరులోనే అగ్రశ్రేణి జట్లు తలపడనుండటంతో అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ మొదలైంది.
ఈ ఏడాది ఐపీఎల్ వేట బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. మార్చి 28న రాత్రి 7:30 గంటలకు జరిగే ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. గత సీజన్లో భారీ స్కోర్లతో సంచలనం సృష్టించిన సన్‌రైజర్స్, ఈసారి తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీతో డిఫెండింగ్ ఛాంపియన్ తో తలపడనుండటం గమనార్హం. కేవలం తొలి 20 మ్యాచ్‌లకు సంబంధించి మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ, మిగిలిన దశల వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.
Also Read
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్‌గా రేర్ రికార్డు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, తాజా షెడ్యూల్ భాగ్యనగర వాసులను కొంత నిరాశకు గురిచేసింది. విడుదలైన మొదటి దశ షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (RGIS) కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. హోమ్ గ్రౌండ్లో తమ జట్టు ఆటను చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది మింగుడుపడని విషయమే అయినప్పటికీ, రెండవ దశ షెడ్యూల్లో ఉప్పల్ స్టేడియానికి మరిన్ని మ్యాచ్‌లు కేటాయించే అవకాశం ఉంది.
Cooling Trick : చిన్న చిట్కాతో పాత కూలర్‌ను ఏసీలా మార్చుకోండి.. చిల్ అవ్వండి.!
షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. అలాగే మార్చి 30న గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 5వ తేదీ క్రికెట్ ప్రియులకు డబుల్ ధమాకా అందనుంది. మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఎస్ఆర్హెచ్ vs ఎల్ఎస్జీ మ్యాచ్ జరుగుతుండగా, అదే రోజు రాత్రి బెంగళూరులో ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుంది. మొత్తంగా ఏప్రిల్ 12వ తేదీ వరకు జరిగే ఈ మొదటి దశలో అన్ని ప్రధాన జట్లు తమ బలాబలాలను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

తాజావార్తలు
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..