IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
- మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం
- ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్
- టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Injury Scare Ahead of IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయమైనట్లు తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో బుమ్రా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. అయితే ఇది రెగ్యులర్ చెకప్‌నా? లేదా ఏదైనా గాయమైందా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఐపీఎల్ ఆరంభానికి ఇంకా నాలుగు రోజులే ఉండడంతో.. బుమ్రా ఇంకా జట్టుతో చేరకపోవడంతో ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
జస్ప్రీత్ బుమ్రా కొన్నేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గతేడాది కూడా వెన్ను నొప్పి కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. అయితే కోలుకుని వచ్చిన బుమ్రా.. టీ20 ప్రపంచ కప్ 2026లో మెరిశాడు. కీలక సమయాల్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశాడు. 8 మ్యాచ్‌లలో 14 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 4/15 గణాంకాలతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
Also Read: Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ
ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా కర్ణాటకలోని బీసీసీఐకేంద్రంలో ఉన్నాడు. 2026 ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న సమయంలో అతను ఇంకా ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. జట్టులో కీలక బౌలర్‌గా ఉన్న బుమ్రా లేకపోతే ముంబై బౌలింగ్ దళం బలహీనపడే అవకాశం ఉంది. ముంబై ఇప్పటికే కెప్టెన్సీ అంశంపై చర్చలతో వార్తల్లో నిలుస్తున్న వేళ.. ఇప్పుడు బుమ్రా పరిస్థితి కూడా మరో సమస్యగా మారనుంది. సరైన ఫిట్‌నెస్ లేకుంటే తొలి మ్యాచ్‌లకు బుమ్రా దూరం కానున్నాడు. త్వరలోనే బీసీసీఐ లేదా ముంబై ఇండియన్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?