Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: భారత టీ20 జట్టుకు తిరిగి రావడానికి సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జట్టు ప్రణాళికల్లో ఆయన లేకపోయినా, దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు సాధిస్తే పునరాగమనానికి తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నాయి. యూకే పర్యటనలో భారత్.. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 0-2తో కోల్పోగా, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-4తో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్లో తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్న అయ్యర్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించినప్పటికీ, ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో విజయాలను అందించలేకపోయాడు.
ఇక, భారత్.. జింబాబ్వే పర్యటనకు సిద్ధమవుతోంది. జూలై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. యూకే పర్యటనలో ఎదురైన నిరాశను మరచి, ఈ సిరీస్‌లో విజయాలతో తిరిగి గాడిన పడాలని భారత జట్టు ఆశిస్తోంది. అదే సమయంలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సూర్యకుమార్ యాదవ్ మళ్లీ భారత జెర్సీ ధరించే రోజు దూరంలో ఉండకపోవచ్చు అనే ప్రచారం ఊపందుకుంది.. కాగా, ఐపీఎల్లో విఫలం అయ్యాడని.. భారత్‌కు టీ-20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌ను పక్కన పెడతారా? కనీసం జట్టులో కూడా ఉండకుండా చేస్తారా? అనే విమర్శలను బీసీసీఐ ఎదుర్కొన్న విషయం విదితమే..
Also Read
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!