Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: వింబుల్డన్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను టెన్నిస్ ప్రపంచంలోని ప్రముఖ ఆటగాళ్లతో పోలుస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు క్రికెట్లో సమానమైన వ్యక్తి ఎవరంటే అది ఎంఎస్ ధోనీయేనని సంజూ శాంసన్ అన్నారు. ధోనీ ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఆటను నడిపిస్తారని, ఆయన ఆటలో కనిపించే సౌలభ్యం, ప్రభావం ఫెడరర్‌ను గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. మరోవైపు యువ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ను విరాట్ కోహ్లీతో పోల్చారు సంజూ… అల్కరాజ్ ఆటలో కనిపించే దూకుడు, శక్తి, పేలుడు స్వభావం కోహ్లీ కెరీర్ ప్రారంభ దశను గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రస్తుత ఛాంపియన్ జానిక్ సిన్నర్ నిలబెట్టుకుంటాడని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నా అంచనా వేశారు. మహిళల విభాగంలో 2022 ఛాంపియన్ ఎలెనా రైబాకినా టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వింబుల్డన్ తన చిన్ననాటి కల అని బోపన్నా పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి టెలివిజన్‌లో వింబుల్డన్ మాత్రమే ఎక్కువగా చూసేవాడినని, తర్వాత అదే కోర్టుల్లో ఆడే అవకాశం రావడం తన జీవితంలో మరపురాని అనుభవమని చెప్పారు. రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్, నోవాక్ జొకోవిచ్ వంటి టెన్నిస్ దిగ్గజాలతో ఒకే యుగంలో ఆడటం తనకు కల నిజమైనట్టేనని బోపన్నా గుర్తుచేసుకున్నారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్‌కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
- Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!