Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే క్రికెట్లో ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత 968 రోజుల విరామం అనంతరం ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన బుమ్రా, రీఎంట్రీ మ్యాచ్‌లోనే రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రాకు వికెట్ దక్కలేదు. అయితే పవర్‌ప్లే అనంతరం రెండో స్పెల్‌లో తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసి తన సత్తా చాటాడు. రోహిత్ శర్మ ఫస్ట్ స్లిప్‌లో అద్భుత క్యాచ్ అందుకోవడంతో బుమ్రా ఖాతాలో కీలక వికెట్ చేరింది.. ఈ వికెట్‌తో బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో 31 వికెట్లు పూర్తి చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు రవీంద్ర జడేజా 30 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, బుమ్రా అతడిని అధిగమించాడు. భువనేశ్వర్ కుమార్ (28), మదన్ లాల్ (27), మహ్మద్ షమీ (26) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
అంతేకాకుండా హ్యారీ బ్రూక్ వికెట్ బుమ్రా వన్డే కెరీర్లో 150వ వికెట్ కావడం మరో విశేషం. దీంతో వన్డేల్లో 150 వికెట్లు పూర్తి చేసిన భారత బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కేవలం 4,605 బంతుల్లోనే ఈ ఘనత సాధించిన బుమ్రా, అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ (4,070 బంతులు), కుల్దీప్ యాదవ్ (4,513 బంతులు) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తాము ముందుగా బౌలింగ్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నామని వెల్లడించాడు. టీ20 సిరీస్ అనంతరం జట్టులో మంచి వాతావరణం ఉందని, అందరూ బాగా సన్నద్ధమయ్యారని గిల్ తెలిపాడు. బుమ్రా రీఎంట్రీతో భారత బౌలింగ్ దళానికి మరింత బలం చేకూరిందని అభిమానులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?