KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ చండీగఢ్ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఉదయం సెషన్ పూర్తిగా ఆఫ్ఘాన్ చేతుల్లోకి వెళ్లాల్సింది. కానీ, క్షేత్రస్థాయిలో వారు చేసిన ఘోర తప్పిదాల వల్ల ఆ అవకాశం చేజారింది. లంచ్ సమయానికి భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చడంలో విఫలం కాగా, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 37 నాటౌట్) మాత్రం అదృష్టంతో పాటు తన అద్భుతమైన నటనతో క్రీజులో నిలదొక్కుకున్నాడు.
జియావుర్ రహ్మాన్ వేసిన ఒక ఓవర్లో కేఎల్ రాహుల్ బ్యాట్ అంచుకు బంతి స్పష్టంగా తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. టీవీ రీప్లేల్లో అది క్లియర్ ఎడ్జ్ అని స్పష్టంగా కనిపించింది. కానీ, ఆఫ్ఘన్ కీపర్ అఫ్సర్ జజాయ్ గానీ, బౌలర్ గానీ కనీసం అప్పీల్ కూడా చేయలేదు. దీనికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ సమయస్ఫూర్తి. బంతి బ్యాట్‌కు తగిలిన వెంటనే రాహుల్ తనకు ఏమీ తెలియనట్లు, అసలు బంతి బ్యాట్‌కు తగలనట్లు చాలా అమాయకంగా తల ఊపాడు. రాహుల్ నటనను చూసి ఆఫ్ఘన్ కెప్టెన్, కీపర్ మోసపోయారు.
Also Read
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
దీనిపై కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ నవ్వులు పూయించే వ్యాఖ్యలు చేశాడు. “ఇక్కడ కేఎల్ రాహుల్ మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడాడు. ఆఫ్ఘన్ కెప్టెన్, కీపర్ అతని వైపు చూడగానే.. తనేమీ ఎడ్జ్ చేయనట్లు తల ఊపాడు, వారు కూడా దాన్ని నమ్మేశారు. రాహుల్ చేసిన నటనకు అతనికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. హాట్సాఫ్ రాహుల్, నీకోసం ఆస్కార్ వస్తోంది!” అంటూ స్వాన్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత లభించిన అవకాశాన్ని వాడుకుంటూ రాహుల్ కొన్ని అద్భుతమైన స్ట్రెయిట్ డ్రైవ్‌లు, ఆన్-డ్రైవ్‌లతో అలరించాడు.
Wait???? Afghanistan didn’t review it? What!! pic.twitter.com/ZFgkAJEo7p
— Rajiv (@Rajiv1841) June 6, 2026
మరోవైపు, సాయి సుదర్శన్ కూడా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డెబ్యూ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే బౌలింగ్‌లో సుదర్శన్ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో రెహ్మానుల్లా గుర్బాజ్ వదిలేశాడు. ఈ లైఫ్ ఉపయోగించుకుని సుదర్శన్, రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. అయితే, మంచి ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ మాత్రం అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. పేసర్ మహ్మద్ సలీమ్ వేసిన బంతి కాస్త అదనపు బౌన్స్ అవ్వడంతో, దాన్ని లెగ్ సైడ్ ఫైన్ లెగ్ వైపు మళ్లించే ప్రయత్నంలో కీపర్ జజాయ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫీల్డింగ్ లోపాలు, అప్పీల్ చేయడంలో చూపిన అలసత్వం కారణంగా తొలి సెషన్లో భారత్ పైచేయి సాధించింది. రెండో రోజు భారత్ 564 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించి.. ఆప్ఘనిస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ప్రస్తుతం 3 వికేట్లు కోల్పోయిన ఆప్ఘనిస్థాన్ 62 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి