ICC Ultimatum to Bangladesh: బంగ్లాదేశ్‌కు ICC డెడ్‌లైన్.. ప్రపంచకప్‌లో ఆడతారా? లేక తప్పుకుంటారా?
- భారత్‌లో ప్రపంచ కప్ ఆడండి లేదా దూరంగా ఉండండి..
- బంగ్లాదేశ్‌కు ఐసీసీ అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Ultimatum to Bangladesh: 2026 టీ20 ప్రపంచకప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠినమైన అల్టిమేటం జారీ చేసింది. భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాల్గొనాలా? లేక టోర్నీ నుంచి తప్పుకోవాలా? అనే విషయంపై జనవరి 21 చివరి తేదీగా నిర్ణయిస్తూ ఐసీసీ స్పష్టత ఇచ్చింది. భద్రతా కారణాలను చూపిస్తూ భారతదేశంలో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తుండటంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. భారత్‌కు బదులుగా శ్రీలంకను ప్రత్యామ్నాయ వేదికగా పరిగణించాలని బీసీబీ కోరుతోంది. అయితే, ఐసీసీ మాత్రం ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌కే కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
Read Also: Vijay: మరోసారి సీబీఐ ముందు హాజరైన విజయ్.. ఎన్నికల వేళ ఏం జరుగుతోంది?
Also Read
- Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
- Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్‌వెల్.. రెండేళ్ల నిషేధం
- FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?
- IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..
తాజాగా, శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధులు రెండోసారి బీసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ 2026 టీ20 ప్రపంచకప్‌ను సహ-ఆతిథ్యం ఇవ్వాలన్న తన కోరికను మరోసారి వెల్లడించినప్పటికీ, భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించలేదు. భద్రతా సమస్యల పేరుతో శ్రీలంకను ప్రత్యామ్నాయ వేదికగా ప్రతిపాదించింది. కానీ, గ్రూప్-సీ లో భాగంగా బంగ్లాదేశ్ ముంబై, కోల్‌కతాల్లో మ్యాచ్‌లు ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. గత మూడు వారాలుగా ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ ఆదేశించడంతో.. ఈ వివాదం మొదలైంది. ఆ తరువాత భారత్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇష్టపడటం లేదని, తమ డిమాండ్లు నెరవేరకపోతే టోర్నీ నుంచి వైదొలగే అవకాశం ఉందని బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసింది. ఈ అంశం తొలిసారి జనవరి 4న వెలుగులోకి వచ్చింది.
ఇక, ఐర్లాండ్‌తో తమ గ్రూప్ మార్పు డిమాండ్‌ను కూడా ఐసీసీ తిరస్కరించినట్లు సమాచారం. ఐర్లాండ్ మ్యాచ్‌లు పూర్తిగా శ్రీలంకలోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ బీసీబీకి హామీ ఇచ్చింది. జనవరి 21 వరకు బీసీబీ నిర్ణయాన్ని ఐసీసీ ఎదురుచూస్తోంది. ఆలోపు బంగ్లాదేశ్ టోర్నీలో పాల్గొనకపోతే, ప్రస్తుత ICC ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రత్యామ్నాయ జట్టును ప్రపంచకప్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ స్థానానికి స్కాట్లాండ్ బలమైన పోటీదారుగా ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ సమస్య పరిష్కారం కాకపోతే పాకిస్తాన్ కూడా తన భాగస్వామ్యాన్ని పునఃసమీక్షించవచ్చని జియో న్యూస్ గతంలో నివేదించింది. భద్రతా అంశాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను సంప్రదించగా, పాకిస్తాన్ పూర్తి మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా, శ్రీలంక అందుబాటులో లేకపోతే బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి తెలియజేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!